భారత అంతరిక్ష పరిశోధన సంస్థ పది నెలల విరామం తర్వాత ఇస్రో పంపించిన పీఎస్ఎల్వీసీ-49 ప్రయోగం విజయవంతం చేయడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా శ్రీ హరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ ప్రయోగం ద్వారా పది ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి పంపారు.
రాకెట్ ప్రయోగానికి సందర్శకులు వచ్చేందుకు అనుమతి లేకపోయినా ఇతర రాష్ట్రాల నుంచి వాహనాలలో చేరుకుని పులికాట్ సరస్సు నుంచి వీక్షించారు. సందర్శకులు సంతోషం వ్యక్తం చేశారు. షార్ ప్రధాన గేట్ వద్దకు చేరుకుని ఆనందం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: పర్వదినాల మాసం... మహిమాన్విత కార్తికం