ETV Bharat / city

వణికిపోతున్న నవాబుపేట.. ఒకేరోజు 18 కరోనా కేసులు!

ఏపీలోని కడప జిల్లా మైలవరం మండలం నవాబుపేట గ్రామం.. కరోనా వ్యాప్తితో వణికిపోతోంది. ఒక్క రోజులోనే 18 పాజిటివ్ కేసులు నమోదు కావడం జిల్లా యంత్రాంగాన్నే కాదు.. ఆ ప్రాంతంలోని వారినీ ఉలిక్కిపడేలా చేసింది. ఈ విషయం తెలిసి ఆందోళనకు గురైన వ్యక్తి గుండెపోటుతో చనిపోవడం నవాబుపేటలో మరింత విషాదాన్ని నింపింది.

ten-corona-positive-cases-recorded-at-navabupeta-kadapa-district
వణికిపోతున్న నవాబుపేట.. ఒకేరోజు 18 కరోనా కేసులు!
author img

By

Published : Jun 3, 2020, 8:20 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని కడప జిల్లా మైలవరం మండలం నవాబుపేటలో రెండు వందల మందికి.. కొవిడ్-19 పరీక్షలు నిర్వహించగా ఒక్క రోజే 18 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. జమ్మలమడుగు ఆర్డీవో నాగన్న, డీఎస్పీ నాగరాజు ఇతర అధికారులు గ్రామాన్ని సందర్శించారు. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. గ్రామమంతా బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. సోడియం హైపోక్లోరైట్​ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఇంకా సుమారు 100 మంది ఫలితాలు రావాల్సి ఉండగా ఎన్ని పాజిటివ్ కేసులు నమోదు అవుతాయోనని స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.

నవాబుపేటలో విషాదం:

గ్రామంలో 18 మందికి కరోనా సోకిందన్న విషయం తెలుసుకున్న ఓ వ్యక్తి గుండె ఆగింది. పాజిటివ్ కేసులు వచ్చిన వారిని క్వారంటైన్​కు తరలించేందుకు గ్రామానికి ఎక్కువ సంఖ్యలో అధికారులు రావడం, అంబులెన్స్​లో వారిని తరలించడం చూసిన 64 సంవత్సరాల దేవదత్తం అనే వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతన్ని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన.. నవాబుపేటలో మరింత విషాదాన్ని నింపింది.

ఇవీ చూడండి: 'మీరు ఎన్ని తప్పులు చేసినా... మీ మీద కరోనా కేసులు లేవు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.