కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో సాధారణ రోగుల తాకిడి తగ్గించేందుకు నిమ్స్ ఆస్పత్రిలో టెలీ మెడిసిన్ కన్సల్టెన్సీ ప్రారంభించారు. ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, రూమటాలజీలకు సంబంధించిన వైద్య సలహాలు టెలీఫోన్ ద్వారా అందించనున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మాత్రమే టెలీ మెడిసిన్ సేవలు అందుబాటులో ఉంటాయి. రకరకాల ఆరోగ్య సమస్యలకు 040-23489244 నెంబరుకు ఫోన్ చేసి వైద్య సలహా, ఔషధ సలహా పొందవచ్చు.
ఇవీ చూడండి: దివ్యాంగ న్యాయవాదిని చావబాదిన ఎస్సైపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు