ETV Bharat / city

Ramoji film city : రామోజీ ఫిలింసిటీకి పర్యాటక పురస్కారం

రామోజీ ఫిలింసిటీకి పర్యాటక పురస్కారం
రామోజీ ఫిలింసిటీకి పర్యాటక పురస్కారం
author img

By

Published : Sep 26, 2021, 8:22 AM IST

08:10 September 26

Ramoji film city : రామోజీ ఫిలింసిటీకి పర్యాటక పురస్కారం

పర్యాటకులకు స్వర్గధామం రామోజీ ఫిలింసిటీకి తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ పురస్కారం లభించింది. సెప్టెంబరు 27 ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ విభాగాల్లో పురస్కారాలను ప్రకటించారు. పర్యాటక శాఖ కమిషనర్‌ శనివారం వివరాలు వెల్లడించారు. పర్యాటకులకు మెరుగైన పౌరసేవల నిర్వహణ విభాగంలో రామోజీ ఫిలింసిటీ ఎంపికైంది. 27న సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌ బేగంపేటలోని ప్లాజా హోటల్‌లో జరిగే కార్యక్రమంలో పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.

మిగతా విభాగాల్లో..

అయిదు నక్షత్రాల హోటల్‌ డీలక్స్‌ విభాగంలో వెస్టిన్‌ హోటల్‌, అయిదు నక్షత్రాల హోటల్‌ కేటగిరీలో బంజారాహిల్స్‌లోని పార్క్‌ హయత్‌, హైదరాబాద్‌ వెలుపల పంచ నక్షత్రాల హోటళ్లలో గోల్కొండ రిసార్ట్‌, నాలుగు నక్షత్రాల హోటల్‌ (హైదరాబాద్‌లో) విభాగంలో బంజారాహిల్స్‌లోని హోటల్‌ దసపల్లా, హైదరాబాద్‌ వెలుపల నాలుగు నక్షత్రాల హోటళ్లలో మృగవని రిసార్ట్‌, మూడు నక్షత్రాల హోటళ్లలో లక్డీకాపుల్‌లోని బెస్ట్‌ వెస్ట్రర్న్‌ అశోకా, ఉత్తమ కన్వెన్షన్‌ సెంటర్‌గా నోవాటెల్‌, హెచ్‌ఐసీసీ కాంప్లెక్స్‌ ఎంపికయ్యాయి. 

ఉత్తమ హరిత హోటళ్ల విభాగంలో ప్రథమ బహుమతికి తారామతి బారాదరి, ద్వితీయ బహుమతికి రామప్పలోని హరిత హోటల్‌, తృతీయ బహుమతికి అలీసాగర్‌లోని హరిత లేక్‌వ్యూ రిసార్ట్‌ ఎంపికయ్యాయి. పర్యాటక అభివృద్ధికి కృషి చేస్తున్న భాగస్వాములకు మొత్తం 16 విభాగాల్లో 19 పురస్కారాలను పర్యాటకశాఖ ప్రకటించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.