ETV Bharat / city

Telangana Top News: టాప్​టెన్​ న్యూస్​ @ 7AM - తెలంగాణ ముఖ్య వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top News
Telangana Top News
author img

By

Published : May 16, 2022, 7:00 AM IST

  • అప్పులపై ఆంక్షలు సడలించండి..

Finance department on debits: అప్పులపై ఆంక్షలు సడలించాలని కోరుతూ తాజాగా కేంద్రానికి రాష్ట్ర ఆర్థికశాఖ లేఖ రాసింది. బాండ్ల విక్రయానికి, రుణాలకు అనుమతించాలని లేఖలో కోరింది. లేదంటే అభివృద్ధి పనులు నిరర్థకమవుతాయని తెలిపింది. కేంద్రం గతంలో లేవనెత్తిన పలు అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం తాజా లేఖలో సమాధానం ఇచ్చింది.

  • ప్రైవేటు ప్రాక్టీసుకు వీల్లేదు..

govt doctors: ఇకపై ప్రభుత్వ వైద్యులకు కొత్త నిబంధన వర్తించనుంది. కొత్తగా చేపట్టబోయే నియామకాల్లో ప్రభుత్వ వైద్యులకు నిబంధన అమలు చేయనున్నారు. ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసు చేయడానికి వీల్లేదని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ రూపొందించిన ప్రతిపాదిత దస్త్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆమోదముద్ర వేసినట్లు తెలిసింది.

  • సమస్యల నిలయంగా అంజన్న సన్నిధి..

కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధిపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఏటీకేడు పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు మెరుగుపర్చాల్సి ఉన్నా... ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లేదని యాత్రికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు, వసతి సమస్య ప్రధానంగా వేధిస్తోంది. 15 కోట్లతో అభివృద్ధి ప్రతిపాదనలు, వంద కోట్లతో మాస్టర్‌ప్లాన్‌ కార్యచరణ కాగితాల్లోనే మూలుగుతున్నాయి.

  • అమెరికా వెళ్లాల్సిన యువకుడు.. అనంత లోకాలకు..

Car accident: పొలాల్లోకి కారు దూసుకెళ్లిన ఘటనలో యువకుడు దుర్మరణం చెందాడు. మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కోహెడ మండలం పర్వేద శివారులో చోటు చేసుకుంది.

  • పేపర్‌ లీకేజీ కేసు.. 10 మందికి మధ్యంతర బెయిల్‌..

Bail in Paper Leakage Case: ఏపీలో పదో తరగతి పేపర్‌ లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణ కుమార్తెలు, అల్లుడితో పాటు మరో 10 మందికి హైకోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. పిటిషనర్ల విజ్ఞప్తి మేరకు ఈ నెల 18 వరకు న్యాయస్థానం మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది.

  • సిమెంట్​ రంగంలోనూ అదానీ జోరు..

Adani Cement Deal: ప్రముఖ వ్యాపార సంస్థ అదానీ గ్రూప్స్ సిమెంట్​ రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఈ మేరకు స్విస్​ సిమెంట్​ అగ్రగామి సంస్థను స్వాధీనం చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు గౌతమ్‌ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్‌ ఆదివారం తెలిపింది.

  • సిక్కు వ్యాపారుల హత్య.. ఖండించిన భారత్​

Sikh Death In Pakistan: పాకిస్థాన్‌లో ఇద్దరు సిక్కు వ్యాపారులను దుండగులు కాల్చి చంపారు. మైనారిటీ వర్గాల లక్ష్యంగానే ఈ దాడులు కొనసాగుతున్నాయని భారత్‌ స్పష్టం చేసింది. ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్సులో జరిగిన ఈ దాడిని పాక్‌ ప్రధాని హెషబాజ్‌ షరీఫ్‌ ఖండించారు.

  • అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం..

Mass shooting at Houston: అగ్రరాజ్యంలో మరోమారు కాల్పుల మోత మోగింది. దేశంలోని పలు ప్రాంతాల్లో దుండుగులు చేసిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందగా.. 8 మంది తీవ్ర గాయాల పాలయ్యారు.

  • రాజస్థాన్ రాజసం.. లఖ్​నవూపై విజయం

IPL 2022: ఐపీఎల్​ 2022లో భాగంగా లఖ్​నవూతో జరిగిన మ్యాచ్​లో రాజస్థాన్​ విజయం సాధించింది. 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లఖ్​నవూను 154 పరుగులకే కట్టడి చేసింది. దీంతో రాజస్ధాన్​ 24 పరుగుల తేడాతో గెలిచింది.

  • సర్కారు వారి పాట సక్సెస్​ వేడుకలు..

Sarkaru Vaari Paata Movie Team at kurnool: 'సర్కారు వారి పాట' సినిమా విజయోత్సవ వేడుకలను నేడు కర్నూలులో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈవేడుకల్లో హీరో మహేశ్​బాబుతో పాటు చిత్ర బృందం పాల్గొంటుందని మహేశ్​బాబు అభిమానులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.