ETV Bharat / city

ఆగస్టులో అమాంతం పెరిగిన వాయు కాలుష్యం! - hyderabad latest news

భాగ్యనగరంలో కాలుష్యం కోరలు చాస్తోంది. వాహనాల రద్దీతో ఆగస్టులో వాయు కాలుష్యం అమాంతం పెరిగినట్లు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి తేల్చింది. వాహనాల రద్దీనే కారణమని అంచనా వేసింది.

air pollution in hyderabad
ఆగస్టులో అమాంతం పెరిగిన వాయు కాలుష్యం
author img

By

Published : Sep 25, 2020, 7:53 AM IST

మహానగరంలో కాలుష్యం కాస్త తగ్గిందని ఊపిరి పీల్చుకోకముందే మళ్లీ కోరలు చాస్తోంది. స్వచ్ఛమైన గాలిని కలుషితం చేసే ధూళి కణాలు దుమ్ము దులుపుతున్నాయి. పీఎం 10 తీవ్రత జూన్‌, జూలైతో పోల్చితే ఆగస్టులో భారీగా పెరిగినట్లు తాజాగా తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(టీఎస్‌పీసీబీ) తేల్చింది. ఇందుకు వాహనాల రద్దీనే కారణమని అంచనా వేస్తున్నారు.

ప్రతీరోజు గాల్లోకి 40 రకాల కాలుష్య ఉద్గారాలు విడుదలవుతుంటాయి. వీటిలో ఒకటి సూక్ష్మ ధూళి కణాలు. మన తల వెంట్రుక మందం 50 మైక్రోగ్రాములు ఉంటే పీఎం 10 సైజు ఆ వెంట్రుకలో అయిదో వంతు ఉంటుంది. పీల్చే గాలిని ఇది కలుషితం చేసి శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు కారణమవుతోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) నిర్దేశిత పరిమితుల ప్రకారం పీఎం 10 తీవ్రత ఘనపు మీటరు గాలిలో వార్షిక సగటు 60 ఎంజీలను దాటరాదు. అది దాటితే అక్కడ కాలుష్యం ప్రమాదకరస్థాయిలో ఉన్నట్లే లెక్క. ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం 20 ఎంజీలు దాటితే అప్రమత్తం కావాల్సిందేనని హెచ్చరిస్తోంది.

వాహనాల రద్దీ, అధ్వాన రహదారులు

హైదరాబాద్‌ కాలుష్యంలో వాహనాల వాటా 50 శాతం పైగానే. లాక్‌డౌన్‌లో అత్యవసర వాహనాలు మినహా మిగిలినవి రోడ్డెక్కలేదు. వాయు నాణ్యత చాలావరకు మెరుగుపడింది. ఆ తర్వాత క్రమేణా వాహన రద్దీ పెరిగింది. ప్రజా రవాణా లేక వ్యక్తిగత వాహనాలను బయటకు తీయడంతో ఏ రోడ్డు చూసినా కిటకిటే. ఆగస్టులో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా కనిపించింది. వాయు కాలుష్యం కూడా అదే స్థాయిలో పెరిగిందని పీసీబీ అధికారులు చెబుతున్నారు. పలు ప్రాంతాల్లోని అధ్వాన రహదారులు కూడా ధూళి కణాల తీవ్రతకు మరో కారణం.

ఇవీచూడండి: భాగ్యనగరంలో నేటి నుంచి సిటీ బస్సులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.