Vinod Kumar Comments on BJP Leaders : రాష్ట్రానికి వచ్చి సర్కారును విమర్శించిన వివిధ రాష్ట్రాల భాజపా నాయకులు.. అభివృద్ధిపై చర్చకు రావాలని.. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ సవాల్ విసిరారు. ఆయా రాష్ట్రాలు అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణకు కనీసం పోటీ ఇవ్వలేవని విమర్శించారు. ఓ వైపు రాష్ట్రం అందిస్తున్న పథకాలను మెచ్చుకుంటూనే.. సర్కారును విమర్శిస్తూ.. భాజపా నాయకులు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారని మండిపడ్డారు. రైతులు, ఎస్సీ, ఎస్టీల సంక్షేమం రాష్ట్రంలో ఉన్నట్లు ఎక్కడా లేదన్నారు. అనవసర విమర్శలు మాని అభివృద్ధిపై చర్చకు రావాలని వినోద్ కుమార్ సవాల్ విసిరారు..
మాతో పోటీకి రాలేరు..
Vinod Kumar on BJP CMs : 'ఓవైపు తెలంగాణ అభివృద్ధి, పథకాల గురించి తెలుసుకుంటూ.. మరోవైపు రాష్ట్ర ప్రగతి, మన ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తున్నారు భాజపా నాయకులు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భాజపా నాయకులు, ముఖ్యమంత్రులు.. విమర్శలు మాని అభివృద్ధిపై చర్చకు రావాలి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, ఛత్తీస్గఢ్ మాజీ సీఎం, అసోం ముఖ్యమంత్రి, మహారాష్ట్ర మాజీ సీఎంలు రాష్ట్రానికి వచ్చి ఏం విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడండి. మీ రాష్ట్రాలతో తెలంగాణ ప్రగతిని చర్చిద్దాం. ఎవరి రాష్ట్రం ప్రగతి పథంలో ఉందో. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, గిరిజనులు, వెనుకబడిన తరగతులకు ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్.. ఆ నాలుగు రాష్ట్రాలను కలిపితే కూడా అన్నీ లేవు. మీకు మాకు పోలికే లేదు. మీరు మాతో పోల్చుకోలేరు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణకు ఏ రాష్ట్రం పోటీరాదు రాలేదు.'
- వినోద్ కుమార్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు