ETV Bharat / city

Telangana Top News: 3PM టాప్​న్యూస్ - 3PM టాప్​న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

3PM TOPNEWS
3PM TOPNEWS
author img

By

Published : Aug 12, 2022, 2:58 PM IST

సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ప్రత్యేకించి యువతలో దయ, కరుణ కలిగి ఉండాలని మహాత్మాగాంధీ చెప్పారని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి వనంలో జరుగుతున్న అంతర్జాతీయ యువజన సదస్సును వర్చువల్​గా ఆయన ప్రారంభించారు.

  • సోషల్​మీడియాలో దిల్​రాజు హల్​చల్​​.. ఏకంగా 36 వేల ట్వీట్లతో

ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు పేరు ప్రస్తుతం ట్విటర్‌ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. 'దిల్‌ రాజు గారు మా బాధ వినండి' అంటూ నెటిజన్లు ట్వీట్లు పెడుతున్నారు. ఇలా, ఒక్కరోజులో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 36 వేల ట్వీట్స్‌ చేశారు. ఉన్నట్టుండి దిల్‌ రాజు పేరు నెట్టింట వైరల్‌ కావడానికి కారణమేమిటంటే?

  • ఎంసెట్ ఫలితాలు విడుదల..

రాష్ట్ర ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌లో టాప్‌-10 ర్యాంకులు సాధించిన వారి పేర్లను వెల్లడించారు.

  • భారీగా బంగారం పట్టివేత.. కోటికి పైగా నగదు స్వాధీనం

కారులో అక్రమంగా తరలిస్తున్న 3కిలోల బంగారాన్ని ఏపీ వైఎస్సార్​ జిల్లా చాపాడు వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.

  • స్వాతంత్య్ర సమరంలో తెలుగు తారకలు

కష్టాలనీ, కన్నీళ్లని.. ఇష్టంగా స్వాగతించారు! కటకటాల జైలు జీవితాన్ని.. ప్రేమగా గుండెలకు హత్తుకున్నారు.. స్వరాజ్య సాధనలో.. గెలుపు గీతికలై వికసించిన తెలుగింటి ఆడపడుచులు ఎందరో. ఈ అమృత మహోత్సవాల్లో మన స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం జీవితాలను ధారబోసిన కొందరి స్ఫూర్తిగాథల్ని స్మరించుకుందాం..

  • ప్రకృతి కన్నెర్ర.. 13 గంటల పాటు వాన.. ఐదుగురు గల్లంతు

కుండపోత వర్షాలు చైనాను అతలాకుతలం చేశాయి. ప్రకృతి ప్రకోపం ధాటికి జొంగ్‌యాంగ్‌ కౌంటీ వణికిపోయింది. పర్వత ప్రాంత వరదలు ముంచెత్తడం వల్ల అనేక కార్లు కొట్టుకుపోయాయి. 13 గంటలపాటు కుంభవృష్టిగా వాన పడిందని.. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఆ దేశ వాతావరణ శాఖ హెచ్చరించింది.

  • టీ20ల్లో 600 వికెట్లు​.. ఆ క్రికెటర్​ అరుదైన రికార్డ్​

వెస్టిండీస్ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడైన డ్వేన్ బ్రావో మరో మైలురాయిని చేరుకున్నాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్​గా నిలిచాడు.

  • 'శాంసంగ్' వారసుడికి క్షమాభిక్ష.. జైలు నుంచి విముక్తి.. ఇక బిజినెస్​పై దృష్టి

లంచం కేసులో దోషిగా తేలి జైలు శిక్ష ఎదుర్కొంటున్న ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం శాంసంగ్‌ వారసుడు లీ జే యాంగ్‌కు దక్షిణ కొరియా ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టింది. ప్రభుత్వ నిర్ణయంతో మరో ఏడాది జైలు శిక్ష ఉండగానే.. జే యాంగ్‌కు కేసు నుంచి విముక్తి లభించింది. త్వరలోనే యాంగ్​ సామ్‌సంగ్‌ కంపెనీ బోర్డులో చేరి, పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టనున్నారు.

  • 'మీకో నమస్కారం.. ప్రధాని రేసులో నేను లేను.. ఇక దయచేసి వదిలేయండి'

దేశవ్యాప్తంగా ఉన్న విపక్ష పార్టీలను ఐక్యం చేసేందుకు తాను ప్రయత్నిస్తామని బిహార్​ సీఎం నీతీశ్​ కుమార్​ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మోదీకి ప్రత్యర్థిగా విపక్షాల కూటమి తరపున నీతీశ్​ పోటీ చేస్తారని వస్తున్న వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు.

  • దిల్లీలో కలకలం.. 2వేల తూటాలు స్వాధీనం.. ఉగ్ర కోణంలో దర్యాప్తు!

పంద్రాగస్టు వేడుకలకు ముందు దిల్లీలో 2వేల తూటాలు దొరకడం కలకలం రేపింది. ఆరుగుర్ని అరెస్టు చేసిన పోలీసులు.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.

  • ఒత్తిడిని అధిగమించి యువత ముందుకెళ్లాలి: కేటీఆర్

సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ప్రత్యేకించి యువతలో దయ, కరుణ కలిగి ఉండాలని మహాత్మాగాంధీ చెప్పారని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి వనంలో జరుగుతున్న అంతర్జాతీయ యువజన సదస్సును వర్చువల్​గా ఆయన ప్రారంభించారు.

  • సోషల్​మీడియాలో దిల్​రాజు హల్​చల్​​.. ఏకంగా 36 వేల ట్వీట్లతో

ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు పేరు ప్రస్తుతం ట్విటర్‌ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. 'దిల్‌ రాజు గారు మా బాధ వినండి' అంటూ నెటిజన్లు ట్వీట్లు పెడుతున్నారు. ఇలా, ఒక్కరోజులో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 36 వేల ట్వీట్స్‌ చేశారు. ఉన్నట్టుండి దిల్‌ రాజు పేరు నెట్టింట వైరల్‌ కావడానికి కారణమేమిటంటే?

  • ఎంసెట్ ఫలితాలు విడుదల..

రాష్ట్ర ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌లో టాప్‌-10 ర్యాంకులు సాధించిన వారి పేర్లను వెల్లడించారు.

  • భారీగా బంగారం పట్టివేత.. కోటికి పైగా నగదు స్వాధీనం

కారులో అక్రమంగా తరలిస్తున్న 3కిలోల బంగారాన్ని ఏపీ వైఎస్సార్​ జిల్లా చాపాడు వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.

  • స్వాతంత్య్ర సమరంలో తెలుగు తారకలు

కష్టాలనీ, కన్నీళ్లని.. ఇష్టంగా స్వాగతించారు! కటకటాల జైలు జీవితాన్ని.. ప్రేమగా గుండెలకు హత్తుకున్నారు.. స్వరాజ్య సాధనలో.. గెలుపు గీతికలై వికసించిన తెలుగింటి ఆడపడుచులు ఎందరో. ఈ అమృత మహోత్సవాల్లో మన స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం జీవితాలను ధారబోసిన కొందరి స్ఫూర్తిగాథల్ని స్మరించుకుందాం..

  • ప్రకృతి కన్నెర్ర.. 13 గంటల పాటు వాన.. ఐదుగురు గల్లంతు

కుండపోత వర్షాలు చైనాను అతలాకుతలం చేశాయి. ప్రకృతి ప్రకోపం ధాటికి జొంగ్‌యాంగ్‌ కౌంటీ వణికిపోయింది. పర్వత ప్రాంత వరదలు ముంచెత్తడం వల్ల అనేక కార్లు కొట్టుకుపోయాయి. 13 గంటలపాటు కుంభవృష్టిగా వాన పడిందని.. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఆ దేశ వాతావరణ శాఖ హెచ్చరించింది.

  • టీ20ల్లో 600 వికెట్లు​.. ఆ క్రికెటర్​ అరుదైన రికార్డ్​

వెస్టిండీస్ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడైన డ్వేన్ బ్రావో మరో మైలురాయిని చేరుకున్నాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్​గా నిలిచాడు.

  • 'శాంసంగ్' వారసుడికి క్షమాభిక్ష.. జైలు నుంచి విముక్తి.. ఇక బిజినెస్​పై దృష్టి

లంచం కేసులో దోషిగా తేలి జైలు శిక్ష ఎదుర్కొంటున్న ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం శాంసంగ్‌ వారసుడు లీ జే యాంగ్‌కు దక్షిణ కొరియా ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టింది. ప్రభుత్వ నిర్ణయంతో మరో ఏడాది జైలు శిక్ష ఉండగానే.. జే యాంగ్‌కు కేసు నుంచి విముక్తి లభించింది. త్వరలోనే యాంగ్​ సామ్‌సంగ్‌ కంపెనీ బోర్డులో చేరి, పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.