ETV Bharat / city

KTR Tweets to Modi : కేంద్రంపై కేటీఆర్ ట్విటర్ వార్

KTR Tweets to Modi : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రంపై ట్విటర్ వార్ ప్రకటించారు. వరుస ట్వీట్లతో మోదీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. గుజరాత్‌లో పవర్ హాలీడే ప్రకటించడాన్ని విమర్శించిన మంత్రి.. మిషన్ భగీరథ పథకంలో కేంద్ర భాగస్వామ్యం గురించి ప్రజలకు చెప్పాలని మోదీకి ట్వీట్ చేశారు.

KTR Tweets to Modi
KTR Tweets to Modi
author img

By

Published : Mar 31, 2022, 7:34 AM IST

KTR Tweets to Modi : ట్విటర్‌లో ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండటమే గాక.. కొన్నిసార్లు ప్రతిపక్షాలపై సెటైర్లు కూడా వేస్తుంటారు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్. పలుమార్లు ప్రతిపక్షాల మాటలకు తూటాలు పేలుస్తూ దీటుగా ట్వీట్‌లు చేస్తుంటారు. మరికొన్ని సార్లు ట్విటర్ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగడుతుంటారు. తాజాగా కేంద్రంపై మరోసారి విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్.

  • Hon’ble PM @narendramodi Ji, please share with the people of Telangana on the quantum of Govt of India’s contribution to the Mission Bhagiratha scheme?

    Appropriating a flagship program of #Telangana Govt where your Govt has Zero contribution is not befitting stature of a PM pic.twitter.com/x5nv7S8GU4

    — KTR (@KTRTRS) March 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

KTR Tweet to PM Modi : గుజరాత్‌లో పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించడాన్ని కేటీఆర్ విమర్శించారు. ఎంతో మంది గొప్ప వ్యక్తులు ఉన్న గుజరాత్‌లో పరిశ్రమలకు పవర్ హాలిడే ఇవ్వడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. ఇది డబుల్ ఇంజినా లేక ట్రబుల్ ఇంజినా అని పరోక్షంగా భాజపాను నిలదీశారు.

KTR Tweets Today : మరోవైపు మిషన్ భగీరథ పథకంలో కేంద్రం భాగస్వామ్యంపైనా కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో కేంద్రం భాగస్వామ్యం ఏంటో ప్రధాని మోదీ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు ఈ పథకంలో కేంద్రం పాత్ర ఉందా అని ప్రశ్నించారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ది అని చెప్పారు. జల జీవన్ మిషన్ ద్వారా 2019 నుంచి రాష్ట్రంలో 38 లక్షలకు పైగా తాగునీటి సౌకర్యం కల్పించినట్లు ప్రధాని మోదీ ప్రకటనపై స్పందించిన కేటీఆర్ ఈ మేరకు ట్వీట్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.