ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @5 PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TELANGANA LATEST TOP NEWS
టాప్​టెన్​ న్యూస్​ @5 PM
author img

By

Published : Jan 27, 2021, 4:59 PM IST

పీఆర్సీపై ఆగ్రహం..

పీఆర్సీ నివేదికపై ఉద్యోగ సంఘాలు భగ్గుమంటున్నాయి. 7.5 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలన్న సిఫారసను నిరసిస్తూ.. ఉపాధ్యాయుల ఐక్య వేదిక జీహెచ్​ఎంసీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఉసూరుమనిపించారు..

ఫిట్‌మెంట్‌ పేరుతో సీఎం కేసీఆర్‌ కొత్త డ్రామాకు తెరలేపారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. 7.5 శాతం ఫిట్‌మెంట్‌కు మూడేళ్ల సమయం కావాలా అని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

గిరిజన జాతికిచ్చిన పురష్కారం

ఎటువంటి గుర్తుంపు లేకుండా.. గుస్సాడీ నృత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనే తపనతోనే కనకరాజు జీవించారని.. మంత్రి సత్యవతి ప్రశంసించారు. 2021 సంవత్సరానికి ప్రకటించిన పద్మ పురస్కారాల్లో కుమురం భీం జిల్లా వాసి కనకరాజును కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

దిల్లీ హింసపై షా వరుస సమీక్షలు

కేంద్ర హోంమంత్రి అమిత్​ షా నివాసంలో ఉన్నతస్థాయి అధికారుల సమావేశం జరిగింది. రైతుల ట్రాక్టర్​ ర్యాలీలో చెలరేగిన హింసపై షాకు అధికారులు నివేదిక అందించారు. ఒక్కరోజు వ్యవధిలో అధికారులతో షా భేటీ కావడం ఇది రెండోసారి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

హైకోర్టు 'లైంగిక వేధింపుల తీర్పు'పై

లైంగిక వేధింపులకు సంబంధించి బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దుస్తుల పైనుంచి తాకితే అది లైంగిక వేధింపుల కిందకు రాదని బాంబే హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

దిల్లీ ఆందోళనలపై ఐరాస స్పందన

సాగు చట్టాలకు వ్యతిరేకంగా గణతంత్ర దినోత్సవం రోజు జరిగిన దిల్లీ ఆందోళనలపై స్పందించింది ఐక్యరాజ్య సమితి. శాంతియుత, అహింసా మార్గంలో చేపట్టే నిరసనలను గౌరవించాలని అభిప్రాయపడింది. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో చెప్పినట్లుగా ఐరాస ప్రతినిధి పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు ఇంకాస్త తగ్గాయి. బుధవారం 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.48,500 దిగువకు చేరింది. వెండి దాదాపు రూ.260 దిగొచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కుప్పకూలిన మార్కెట్లు

స్టాక్ మార్కెట్లపై మరోసారి బేర్​ పంజా విసిరింది. బుధవారం సెషన్​లో సెన్సెక్స్, నిఫ్టీ సుమారు 2 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి. దాదాపు అన్ని రంగాలు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోవడం, కేంద్ర బడ్జెట్ ముందు నెలకొన్న భయాలు సహా పలు ఇతర అంశాలు నష్టాలకు కారణమయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

మరోసారి ఆస్పత్రిలో చేరిన గంగూలీ

బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో అయన కోల్‌కతాలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. మరోసారి ఛాతీనొప్పి రావడం వల్ల ఆయన ఆస్పత్రిలో చేర్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'ఆర్​ఆర్​ఆర్' రిలీజ్​.. బీటౌన్​ నిర్మాత అసంతృప్తి

'ఆర్​ఆర్​ఆర్​' సినిమా విడుదల తేదీపై బాలీవుడ్​ నిర్మాత బోనీ కపూర్​ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను నిర్మిస్తున్న 'మైదాన్​' రిలీజ్​ డేట్​ ఆరు నెలల ముందే ప్రకటించినా.. ఆ చిత్రానికి పోటీగా రాజమౌళి సినిమా రిలీజ్​ చేయడం సరికాదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.