ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను బోర్డు ప్రకటించింది. నేటి నుంచి ఫిబ్రవరి 11 వరకు మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు.
వంద రూపాయల ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 22 వరకు, 500 రూపాయల ఆలస్య రుసుముతో మార్చి 2 వరకు, వెయ్యి రూపాయల ఆలస్య రుసుముతో మార్చి 9 వరకు, 2వేల రూపాయల ఆలస్య రుసుముతో మార్చి 16 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చునని జలీల్ తెలిపారు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మే 1 నుంచి జరగనున్నాయి.
ఇదీ చదవండి : షావోమి కొత్త ఫోన్.. ఎటు తిప్పినా డిస్ప్లేనే!