మర్కజ్‌కు హాజరైన 17మంది రోహింగ్యాలు నల్గొండకు వచ్చినట్లు గుర్తించడంలో నిఘా విభాగం కీలక పాత్ర పోషించింది. రాష్ట్రం నుంచి 1,030 మంది మర్కజ్‌కు వెళ్లగా వారిలో దాదాపు 40మంది ఆచూకీ దొరకలేదు. వీరంతా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు అందరూ ఆందోళన చెందారు. అయితే రైళ్ల రద్దుతో వీరు దిల్లీలో ఇరుక్కుపోయారని తొలుత నిఘా విభాగమే గుర్తించింది.
సాంకేతికతతో..
వ్యాధి సోకిన వాళ్లల్లో కొంతమంది అజ్ఞాతంలోకి వెళ్లడం బయటకు చెప్పకుండా తిరగడం వల్ల మిగతా వారికి ఈ వైరస్ సోకుతుండడంతో నిఘా విభాగం అప్రమత్తమైంది. మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారిలో చాలామంది వైద్య పరీక్షలకు ముందుకు రాలేదు. ఆ కార్యక్రమానికి రాష్ట్రం నుంచి ఎవరెవరూ వెళ్లారని గుర్తించేందుకు నిఘా విభాగం తీవ్రంగా కృషి చేసింది. చిరునామాలు కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్నవారిని గుర్తించేందుకు సాంకేతిక చాలా ఉపయోగపడింది.
నిర్ధరణ అయిన వెంటనే అప్రమత్తం
ఒక వ్యక్తికి వైరస్ సోకినట్లు తెలిసేలోపే ఆ వ్యక్తి మరికొంతమందిని కలిసి ఉండటంతో వారిని కూడా గుర్తించటంలో నిఘా విభాగం నిమగ్నమైంది. ఈ పనిలో స్థానిక సమాచారం సేకరించడం మొదలు ఎక్కడెక్కడ తిరిగారు.. ఎవరెవరితో మాట్లాడారు అనే ఆధారాలను సెల్ ఫోన్ సిగ్నల్ ద్వారా సేకరించారు. దీని ద్వారా దర్యాప్తు సులభమైంది. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో నిఘా విభాగం మరింత అప్రమత్తంగా ఉంటోంది. ఏదైనా ప్రాంతంలో ఒక కేసు నిర్ధరణ అయిన వెంటనే సదరు వ్యక్తి కదలికలకు సంబంధించిన సమాచారాన్ని స్థానిక పోలీసులకు చేరవేస్తోంది.
ఇదీ చూడండి: ఎలాంటి సడలింపులుండవ్.. మే 7వరకు లాక్డౌన్