జగన్ అక్రమాస్తుల కేసుల్లో నాంపల్లి కోర్టులో ఉన్న ఒక ఈడీ ఛార్జ్‌షీట్‌ను సీబీఐ కోర్టుకే బదిలీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులపై సీబీఐ ఛార్జ్షీట్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్... నాంపల్లి సీబీఐ కోర్టులో 6 ఛార్జ్షీట్లు, నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో ఓ ఛార్జ్‌షీట్‌ను గతంలో దాఖలు చేసింది. సీబీఐ కోర్టులో ప్రధాన కేసులు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని జగతి పబ్లికేషన్స్ ప్రస్తావించింది.
నాంపల్లి కోర్టులో పెండింగులో ఉన్న అరబిందో, హెటిరో భూ కేటాయింపులకు సంబంధించిన ఈడీ కేసును సైతం.. అక్కడికే బదిలీ చేయాలని జగతి పబ్లికేషన్స్ కోరింది. నాంపల్లి కోర్టు ఈ విజ్ఞప్తికి నిరాకరించగా... జగతి పబ్లికేషన్స్ హైకోర్టును ఆశ్రయించింది. వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. అన్నీ ఒకే చోట విచారణ జరిపేందుకు వీలుగా.. అరబిందో, హెటిరో ఈడీ కేసు కూడా సీబీఐ కోర్టుకు బదిలీ చేయాలని ఆదేశించింది. ఈనెల 30న నాంపల్లి కోర్టులో కేసు ఉన్నందున.. ఆరోజు బదిలీ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది.
- ఇదీ చదవండి : బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్ వ్యాఖ్యలతో దుమారం