ETV Bharat / city

Sujana Chowdary : అమెరికా వెళ్లేందుకు సుజనాచౌదరికి హైకోర్టు అనుమతి - Sujana Chowdary cbi case

అమెరికా వెళ్లేందుకు ఎంపీ సుజనాచౌదరికి హైకోర్టు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చింది. లుకౌట్​ నోటీసు పెండింగ్​లో ఉన్నందున హైకోర్టును అశ్రయించిన సుజనాచౌదరికి.. షరతులతో కూడిన అనుమతిని ధర్మాసనం ఇచ్చింది. ఈ నెల 12 నుంచి ఆగస్టు 11 వరకు అమెరికాకు వెళ్లొచ్చని తెలిపింది.

telangana HC permits mp Sujana Chowdary to fly abroad

author img

By

Published : Jul 10, 2021, 7:01 PM IST

అమెరికా వెళ్లేందుకు అనుమతి కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరికి అనుకూల తీర్పు వచ్చింది. అమెరికా వెళ్లేందుకు ధర్మాసనం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈ నెల 12 నుంచి ఆగస్టు 11 వరకు అమెరికా వెళ్లొచ్చని తెలిపింది. యూఎస్​ఏకు వెళ్లే ముందు.. వచ్చాక సీబీఐకి వివరాలు సమర్పించాలని హైకోర్టు షరతు విధించింది.

లుకౌట్​ నోటీసు పెండింగ్​లో ఉన్నందున...

అమెరికాలో ఓ సదస్సుకు హజరయ్యేందుకు తనకు అనుమతినివ్వాలని కోరుతూ సుజనా చౌదరి ఇటీవలే హైకోర్టును ఆశ్రయించారు. సదస్సు కోసం తనకు ఆహ్వానం అందిందని ధర్మాసనానికి సుజనాచౌదరి తెలిపారు. లుకౌట్‌ నోటీసు పెండింగ్‌లో ఉన్నందున అనుమతివ్వాలని పిటిషన్‌లో కోరారు. పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని ధర్మాసనాన్ని కోరారు. జులై రెండో వారంలో అమెరికాలో సదస్సుకు హాజరు కావాల్సి ఉందని, సదస్సు కోసం అమెరికా నుంచి ఆహ్వానం అందిందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం షరతులతో కూడిన అనుమతినిచ్చింది.

నోటీసులపై అభ్యంతరం ఉంటే...

సుజనా చౌదరికి సీబీఐ నోటీసులపై కూడా హైకోర్టులో విచారణ జరిగింది. బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్ కేసులో సుజనను విచారించామని, అవసరమైతే మళ్లీ పిలుస్తామని సీబీఐ తెలిపింది. విచారణ పేరుతో మళ్లీ పిలిచే అవకాశముందని సుజన తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. విచారణకు పిలిస్తే నోటీసులివ్వాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. నోటీసులపై అభ్యంతరం ఉంటే మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: కార్యకర్త చెంప చెళ్లుమనిపించిన డీకే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.