తెలంగాణ సోనా వరి రకానికి బ్రాండింగ్‌తో పాటు మార్కెటింగ్ కల్పించడానికి... ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌తో కలిసి పనిచేయనున్నట్లు రాష్ట్రప్రభుత్వం పేర్కొంది. వ్యవసాయ విభాగం, రాష్ట్రప్రభుత్వం, ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా పనిచేస్తాయని తెలిపింది. తద్వారా వానాకాలం, యాసంగి సీజన్‌లలో సోనా రకాలు పండించే రైతులకు లబ్ధి చేకూరనుంది. ఆ బియ్యం షుగర్ వ్యాధి నివారణకు ఉపయోగపడుతోంది.
ఇవీ చూడండి: 'ఉద్యోగాలు పోగొట్టారు, దోచుకున్నారు.. మిగిలింది'