ETV Bharat / city

ఐసొలేషన్‌ కిట్‌లో స్టెరాయిడ్‌ మందులు

కొవిడ్‌ అని నిర్ధారణ అయిన తర్వాత మందులు వాడుతున్నా 5-7 రోజులుగా జ్వరం తగ్గడం లేదా? పైగా 101 డిగ్రీల కంటే పైగా నమోదవుతుందా? అయితే స్టెరాయిడ్‌ ఔషధాన్ని కూడా అదనంగా వాడాల్సిందేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆదివారం కీలక నిర్ణయం తీసుకొంది. కొవిడ్‌ నిర్ధారణ కాగానే ప్రభుత్వం అందజేస్తోన్న ఐసొలేషన్‌ కిట్‌లో పెట్టి స్టెరాయిడ్‌లను కూడా ఇస్తారు. ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి.

corona isolation
ఐసొలేషన్‌ కిట్‌లో స్టెరాయిడ్‌ మందులు
author img

By

Published : May 3, 2021, 7:26 AM IST

ప్రస్తుతం యాంటీబయాటిక్స్‌, జ్వరం గోలీలు, వేర్వేరు విటమిన్‌ మాత్రలను కలిపి ఒక ప్లాస్టిక్‌ కవర్‌లో వేసి కిట్‌గా ఇస్తున్నారు. ఈ కవర్‌లోనే మరో చిన్న పొట్లాన్ని ఎరుపు రంగు చిహ్నాన్ని వేసి అందించనున్నారు. ఇందులో స్టెరాయిడ్‌ ఔషధాలుంటాయి. ఎన్ని రోజుల పాటు.. ఎలా వాడాలో కూడా అందులో రాసి ఉంటుంది. సాధారణ కొవిడ్‌ ఔషధాలను వాడుతున్నా 5-7 రోజుల్లోగా జ్వరం తగ్గకపోగా మరింతగా పెరుగుతుండడం, దగ్గు కూడా తీవ్రమవుతుండడం వంటి లక్షణాలు కనిపించగానే.. ఈ స్టెరాయిడ్‌ ఔషధాలను మొదలుపెట్టాలి. ప్రస్తుతం 14 లక్షల మందికి సరిపడేన్ని ఐసొలేషన్‌ కిట్లు అందుబాటులో ఉన్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి.

ఒకవేళ ముందే వాడితేనో?

స్టెరాయిడ్‌ ఔషధాలను అవగాహన లోపంతో ముందు నుంచే వాడితే ఎలా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ సమస్యను నివారించడానికే ప్రత్యేక కవర్‌లో స్టెరాయిడ్‌ ఔషధాలను ఇవ్వడంతో పాటు దీన్ని గుర్తుంచుకోవడానికి వీలుగా ‘ఎరుపు’ రంగును కూడా ముద్రించాలని నిర్ణయించారు.

రెండు పూటలా పరీక్షలు

ఐసొలేషన్‌ కిట్‌ అందజేసిన తర్వాత ఆరోగ్య కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు బాధితుల ఇళ్లకు వెళ్లి రోజూ ఉదయం, సాయంత్రం పరీక్షలు చేస్తారు. ఇందులో ప్రధానంగా జ్వరం ఎంత ఉంది? రక్తంలో ఆక్సిజన్‌ శాతం ఎంత నమోదవుతుంది? అనేవి పరీక్షించడంతో పాటు రోగికి ఆయాసం ఏమైనా వస్తుందా? దగ్గు పెరుగుతోందా? తదితర ఆరోగ్య సమాచారాన్ని కూడా సేకరిస్తారు. బాధితులు.. ఇళ్ల వద్ద చికిత్స పొందుతున్నన్ని రోజులు కూడా ఈ విధానం కొనసాగుతుంది.

ఇవీచూడండి: ప్రభుత్వాస్పత్రుల్లో ఓపీ సేవలు ప్రారంభించాలని సీఎస్‌ ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.