ETV Bharat / city

జులై 31 వరకు.. వాహన పన్ను గడువు పెంపు!

వాణిజ్య వాహనాల త్రైమాసిక పన్ను చెల్లింపు గడువు పెంచుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మరోసారి నిర్ణయం తీసుకుంది. లాక్​డౌన్​ నేపథ్యంలో ఎత్తేసిన వాణిజ్య వాహనాల త్రైమాసిక పన్ను చెల్లింపు గడువును ఈ నెల 31 వరకు పెంచుతూ జీవో జారీ చేసింది.

Telangana government Extend Vehicle Fee Pay Last Date
జులై 31 వరకు.. వాహన పన్ను గడువు పెంపు!
author img

By

Published : Jul 7, 2020, 11:58 AM IST

వాణిజ్య వాహనాల త్రైమాసిక పన్ను చెల్లింపు గడువును ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులతో పాటు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. వాణిజ్య వాహనాల యజమానులు ప్రతి మూడు నెలలకు ముందస్తుగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వాహన యజమానుల అభ్యర్థన మేరకు.. అధికారులు పన్ను చెల్లింపు గడువును జులై 7వరకు పొడిగించారు. దీనిపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మంత్రివర్గ సమావేశంపై స్పష్టత లేకపోవడం వల్ల గడువును ఈనెల 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

ఇదీ చూడండి: చేనేత రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.