ETV Bharat / city

'తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని డిసెంబర్​ 3న జరుపుకోవాలి..'

author img

By

Published : Jun 2, 2022, 4:42 PM IST

KA Paul on Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జూన్​ 2కు బదులు.. డిసెంబర్​ 3న జరుపుకోవాలని కేఏ పాల్​ డిమాండ్​ చేశారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలతోనే రాష్ట్రం సిద్ధించిందని.. అందుకు ఆధ్యుడైన శ్రీకాంతాచారి అసువులు బాసిన రోజునే ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకోవాలని కోరారు.

Telangana Formation Day should be celebrated on December 3 demanded KA Paul
Telangana Formation Day should be celebrated on December 3 demanded KA Paul
'తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని డిసెంబర్​ 3న జరుపుకోవాలి..'

KA Paul on Telangana Formation Day: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. గన్‌పార్కు వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. శ్రీకాంత చారి బలిదానం చేసుకున్న రోజైన డిసెంబర్‌ 3న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించాలని పాల్‌ డిమాండ్ చేశారు. ప్రజాశాంతి పార్టీ తరఫున శ్రీకాంత్‌ చారి నాన్నను ఎమ్మెల్యేగా నిలబెడతానని ప్రకటించారు. అమరవీరుల కుటుంబాలకు ఉచిత విద్యా, వైద్యం అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రజాశాంతి పార్టీ ప్రజల కోసమే ఉందని.. వారి సమస్యల పరిష్కారాల కోసం పోరాటం చేస్తామని పాల్​ తెలిపారు.

"ఎంతో మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ ఏర్పడింది. దాంట్లో ముఖ్యంగా శ్రీకాంతాచారి ఆత్మబలిదానంతోనే రాష్ట్రం ఏర్పాటుకు పునాది పడింది. అందుకే రాష్ట్ర అవతర దినోత్సవాన్ని శ్రీకాంతాచారి అమరుడైన రోజు డిసెంబర్​ 3న జరపాలని డిమాండ్​ చేస్తున్నారు. తెలంగాణ రియల్​ ఫార్మేషన్​ డే డిసెంబర్​ 3 రోజేనని మా పార్టీ తరఫున నిర్ణయిస్తున్నాం. శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారికి మా పార్టీలో ఎమ్మెల్యే టికెట్​ ఇచ్చి అసెంబ్లీలో అడుగుపెట్టిస్తామని హామీ ఇస్తున్నాం. మిగతా అమరవీరుల కుటుంబాలకు ఉచిత విద్యా, వైద్యం అందించనున్నాం." -కేఏ పాల్‌, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.