రాష్ట్రంలో 45 ఏళ్లు దాటిన వారికి మాత్రమే కరోనా టీకా ఇస్తున్నట్లు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఆన్‌లైన్‌లో ముందుగా రిజిస్టర్ చేసుకున్నవారికే వ్యాక్సినేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా నేరుగా వ్యాక్సినేషన్ కేంద్రాలకు వచ్చే వారికి టీకాలు ఇవ్వడం లేదని తెలిపారు.
జీహెచ్‌ఎంసీలో ప్రభుత్వ కేంద్రాల్లోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్కో కేంద్రంలో రోజుకు 200 మందికి, మిగిలిన ప్రాంతాల్లో ఒక్కో కేంద్రంలో రోజుకు 100 మందికి మాత్రమే టీకాలు వేస్తున్నట్లు తెలిపారు.