రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ హెచ్చుతున్నాయి. కొత్తగా 925 కేసులు నమోదు కాగా ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,62,653 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ బారిన పడి ఇప్పటివరకు 1,426 మంది మృతి చెందారు.
కరోనా నుంచి మరో 1,367 మంది బాధితులు కోలుకోగా... వారి సంఖ్య 2,49,157కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 12,070 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 9,741 మంది బాధితులుండటం గమనార్హం. అటు జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 161 కరోనా కేసులు నమోదుకాగా... మేడ్చల్ జిల్లాలో 91, రంగారెడ్డి జిల్లాలో 75 మందికి కొవిడ్ సోకింది.