CM KCR to Visit Kolhapur : ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు కుటుంబ సమేతంగా చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన కేసీఆర్‌కు.. కొల్హాపూర్ విమానాశ్రయంలో అధికారులు స్వాగతం పలికారు. దేశంలోని శక్తి పీఠాల్లో ఒకటైన మహలక్ష్మీ అమ్మవారికి కాసేపట్లో కుటుంబ సమేతంగా కేసీఆర్ ప్రత్యేక పూజలు చేయనున్నారు.
దర్శనం అనంతరం సాయంత్రం హైదరాబాద్ తిరుగుపయనం కానున్నారు. లక్ష్మీదేవికి ప్రత్యేకించి ఉన్న ఆలయాల్లో కొల్హాపూర్ కోవెల ముఖ్యమైంది. అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలలో ఏడవదిగా చెప్పుకునే ఈ ఆలయాన్ని ప్రతియేటా లక్షలాది భక్తులు దర్శించుకుని ఆమె దీవెనలను కోరుకుంటారు.