ETV Bharat / city

రాష్ట్రంలో మే 29 వరకు లాక్​డౌన్​

author img

By

Published : May 6, 2020, 12:34 AM IST

రాష్ట్రంలో మే 29 వరకు లాక్​డౌన్​ కొనసాగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్​ వెల్లడించారు. 33 జిల్లాల్లో రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

telangana cm kcr announced that lock down will continue till may 29
రాష్ట్రంలో మే 29 వరకు లాక్​డౌన్​

రాష్ట్రంలో మే 29 వరకు లాక్​డౌన్​ కొనసాగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్​ వెల్లడించారు. 33 జిల్లాల్లో రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లాక్​డౌన్​ను ఎత్తివేస్తే కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్​ తెలిపారు. మే 29 వరకు లాక్​డౌన్​ పొడిగిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తమకు తామే స్వీయ నియంత్రణను పాటించాలని సూచించారు. కరోనా నియంత్రణకు ఉన్న ఒకే ఒక ఆయుధం లాక్​డౌన్‌ అన్న సీఎం.. ప్రజలందరూ నిబంధనల పాటించాలని స్పష్టం చేశారు. 33 జిల్లాల్లో రాత్రి పూట కర్ఫ్యూ కొనసాగుతుందన్నారు.

కొద్ది రోజులు ఓపిక పడితే మంచి ఫలితాలు వస్తాయని ఆకాంక్షించారు. కరోనా నియంత్రణ విషయంలో కేంద్రం మార్గదర్శకాలను తప్పకుండా పాటిస్తామని స్పష్టం చేశారు. మే 15న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు.

ఇవీచూడండి: 'రైతుల నుంచి రూ.5223 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేశాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.