ETV Bharat / city

TS NEWS: శాసనసభ, శాసనమండలి ప్రోరోగ్

author img

By

Published : Jun 2, 2021, 8:21 PM IST

రాష్ట్రంలోని ఉభయసభల సమావేశాలను ప్రోరోగ్(prorogue) చేస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(tamilisai soundararajan) నిర్ణయం తీసుకున్నారు. ఉభయసభలు ప్రోరోగ్ కావడం వల్ల క్యూఆర్ కోడ్ ఆధారిత విత్తన విధానం, బయోఫెర్టిలైజర్స్​కు సంబంధించి ఆర్డినెన్స్​లను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే అవకాశం ఉంది.

telangana assembly meetings prorogue
telangana assembly meetings prorogue

శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రోరోగ్(prorogue) అయ్యాయి. మార్చి 15 నుంచి ప్రారంభమైన ఉభయసభల సమావేశా(assembly meetings)లను ప్రోరోగ్ చేస్తూ గవర్నర్(governor of telangana) తమిళిసై సౌందరరాజన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సిఫారసుకు ఆమోదముద్ర వేశారు. అందుకు అనుగుణంగా శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఆర్డినెన్స్​ల జారీ కోసం ఉభయసభలను ప్రోరోగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

రాష్ట్రంలో కల్తీ విత్తనాల నిరోధం కోసం క్యూఆర్ కోడ్ ఆధారిత విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అటు బయోఫెర్టిలైజర్స్​ను కూడా చట్టపరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు చట్టసవరణ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం... ప్రస్తుతం సమావేశాలు లేనందున ఆర్డినెన్స్​లు జారీ చేయాలని నిర్ణయించింది. ఉభయసభలు ప్రోరోగ్ కావడం వల్ల క్యూఆర్ కోడ్ ఆధారిత విత్తన విధానం, బయోఫెర్టిలైజర్స్​కు సంబంధించి ఆర్డినెన్స్​లను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: DIGITAL SURVEY: జూన్‌ 11 నుంచి పైలట్‌ విధానంలో డిజిటల్‌ భూసర్వే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.