TDP Polit bureau on HC Verdict: రాజధాని అమరావతిపై ఏపీ హైకోర్టు తీర్పును తెదేపా పొలిట్ బ్యూరో స్వాగతించింది. తెదేపా కేంద్ర పార్టీ కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న పొలిట్ బ్యూరోలో హైకోర్టు తీర్పుపై స్పందించారు.
జగన్ ఇప్పటికైనా మూడు రాజధానులు అనే మోసాన్ని కట్టిపెట్టాలని పొలిట్‌బ్యూరోలో నేతలు డిమాండ్ చేశారు. 'ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని' అని ప్రకటించి వెంటనే అమరావతి నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మూడు రాజధానులు పేరుతో ఇతర ప్రాంతాలను సీఎం మోసం చేశారని తెదేపా నేతలు ఆరోపించారు. కోర్టు తీర్పును స్వాగతిస్తూ.. రాజధాని నిర్మాణం ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ పోలిట్ బ్యూరో తీర్మానం చేసింది.
తెదేపా కుటుంబాలకు సాయం..
సభ్యత్వ నమోదు కార్యక్రమంపై నారా లోకేశ్ వివరాలు వెల్లడించారు. ఇప్పటివరకు తెదేపా కార్యకర్తల కుటుంబాలకు ఇన్స్యూరెన్స్ ద్వారా 100 కోట్ల సాయం అందించినట్లు లోకేశ్ వివరించారు.
మూడు రాజధానుల డ్రామాకు తెర..
మరోవైపు రాజధాని అంశంలో హైకోర్టు తీర్పుపై తెలుగు వర్క్‌షాప్‌లో తెదేపా నేతలు దేవివేని ఉమా, బుచ్చల అర్జునుడు నేతృత్వంలో రైతు కమిటీ ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు సీఎం జగన్‌కు చెంపపెట్టు అని దేవినేని అన్నారు. మూడు రాజధానుల డ్రామాకు తెరపడిందని సంతోషం వ్యక్తం చేశారు. అమరావతి గ్రాఫిక్స్ ముగిసిందని విమర్శించిన బూతుల మంత్రులు క్షమాపణ చెప్పాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు.
TDP Leaders: రాజధాని అంశం పై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ తీర్పుతోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని చెప్పారు. హైకోర్టు తీర్పును గౌరవించి ప్రభుత్వం ముందుకు వెళ్లాలని మరో అప్పీల్‌కు వెళ్లొద్దన్నారు. రాజధాని భూములు అభివృద్ధి చేసి ప్రభుత్వం రైతులకు అప్పగించాలి తెలిపారు. డివిజన్ బెంచ్ తీర్పును యథాతథంగా అమలు చేయాలని చెప్పారు.
TDP Leaders: రాజధాని తీర్పు... అమరావతి రైతుల విజయమని శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ అన్నారు. రాజధాని అంశంలో తెదేపా వాదనే నిజమైందని వ్యాఖ్యానించారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రానికి సీఎం జగన్ తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. విభజన చట్టాన్ని పార్లమెంట్ చేసిందని... రాష్ట్రపతి ఆమోద ముద్ర గుర్తుచేశారు.
TDP Leaders: అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ అభివృద్ధి చేయాలని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. రాజధాని వివాదాలకు సీఎం స్వస్తి పలకాలని... రాజధాని రైతులపై కక్షపూరిత చర్యలు ఆపాలని హెచ్చరించారు.