ఏపీలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రెండు రాష్ట్రాల సీఎంలు వాటాలు పంచుకొని ప్రజలను దగా చేస్తున్నారని తెదేపా నేత కొత్తకోట దయాకర్ రెడ్డి దుయ్యబట్టారు. ప్రభుత్వాల చర్యలతో దక్షిణ తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో కృష్ణానదిపై ఉన్న జూరాలను బహుళార్థక సాధక ప్రాజెక్టుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
జగన్ సర్కార్ నూతనంగా నిర్మిస్తున్న పోతిరెడ్డిపాడు, సంగమేశ్వర ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం వెంటనే అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనైనా మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లోని ఎమ్మెల్యేలు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై గళం విప్పాలన్నారు. మీ పదవులు పోయినప్పటికీ ప్రజలు మిమ్ముల్ని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని వివరించారు.
ఇదీ చదవండిః భాగ్యనగరంలో వర్షం... ట్రాఫిక్కు అంతరాయం