ETV Bharat / city

మనుషుల ప్రాణాల కంటే ఎన్నికలు ముఖ్యమా ?: చంద్రబాబు - స్థానిక ఎన్నికల వాయిదాపై చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి జగన్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. జగన్‌ ఎవరు చెప్పినా వినరు అనేదానికి ఇదే ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. మనుషుల ప్రాణాల కంటే ఎన్నికలే ముఖ్యమా? అని చంద్రబాబు ప్రశ్నించారు. రాజ్యాంగం నుంచే జగన్​కు అధికారాలు వచ్చాయని గుర్తు చేశారు. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

chandra babu
chandra babu
author img

By

Published : Mar 15, 2020, 8:56 PM IST

ఏపీ ఎన్నికల సంఘంపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. మీడియా సమావేశంలో జగన్​ తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారని విమర్శించారు. కరోనా వైరస్‌ ప్రపంచం మొత్తం మహమ్మారిగా మారిందన్న చంద్రబాబు... కరోనా బారినపడిన వారి సంఖ్య ఇప్పటికే లక్ష దాటిపోయిందన్నారు. కరోనాతో ఇప్పటివరకు 5వేల మందికి పైగా చనిపోయారని.. చైనా, ఇటలీలో ఔషధాల దుకాణాలు తప్ప, అన్నీ మూసివేశారని తెలిపారు. మనుషుల ప్రాణాలకంటే ముఖ్యమా ఎన్నికలు అని ప్రశ్నించారు.

మనుషుల ప్రాణాల కంటే ఎన్నికలు ముఖ్యమా ?: చంద్రబాబు

కరోనా అవగాహనపై చర్యలేవి?

నేపాల్‌, భూటాన్‌ నుంచి రాకపోకలను నిషేధించాలని ప్రధాని మోదీ నిన్న ఆదేశించారని చంద్రబాబు గుర్తు చేశారు. కరోనా వైరస్‌ పెద్ద సమస్య కాదని రెండ్రోజుల క్రితం చెప్పిన తెలంగాణ సీఎం కేసీఆర్.. విద్యాసంస్థలు, థియేటర్లు మూసివేయాలని చెప్పిన విషయం జగన్​కు తెలియదా అని ప్రశ్నించారు. వివాహాలు కూడా వాయిదా వేసుకోవాలని కేసీఆర్​ చెప్పారన్నారు. కరోనా వ్యాప్తి చెందితే మనదేశంలో ఆస్పత్రులు కూడా సరిపోవని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. గ్రామాలన్నీ క్వారంటైన్లుగా మారిపోతాయన్నారు. కరోనాపై అవగాహన కల్పించే చర్యలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదని.. ప్రజల ప్రాణాలతో ఆడుకునే హక్కు ఈ సీఎం జగన్​కు లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.

రాజ్యాంగం నుంచే అధికారాలు వచ్చాయి

మనుషుల ప్రాణాల కంటే ఎన్నికలే ముఖ్యమా? అని చంద్రబాబు ప్రశ్నించారు. రాజ్యాంగం నుంచే జగన్​కు అధికారాలు వచ్చాయని గుర్తు చేశారు. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇక్కడి పోలీసులకు నిర్వహణ సత్తా లేనందున... కేంద్ర బలగాల మోహరించి ఎన్నికలు నిర్వహించాలన్నారు. పులివెందుల రాజకీయంతో అభ్యర్థులతో బలవంతంగా నామినేషన్లు ఉపసంహరించారని ఆరోపించారు. ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ను తాను నియమించాననడంలో ఏమాత్రం వాస్తవం లేదని... గతంలో సీఆర్​ బిశ్వా అనే అధికారిని కోరితే... అప్పటి గవర్నర్‌ నరసింహన్‌ రమేశ్‌ను నియమించారని గుర్తుచేశారు. ఎన్నికల సంఘం సీఎం జగన్​ హిట్​ లిస్ట్​లో ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: 'సీఎం కంటే ఎన్నికల కమిషనర్ ఎక్కువా?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.