ETV Bharat / city

ఎంసెట్‌ ఐచ్ఛికాల నమోదుపై ఈసారీ సస్పెన్స్‌ - తెలంగాణ ఎంసెట్ 2022

Suspense on TS EAMCET Options రాష్ట్రంలో ఎంసెట్ ఇంజినీరింగ్ ధ్రువపత్రాల పరిశీలన మొదలైనా ఆప్షన్ల నమోదు ఇంకా షురూ అవ్వలేదు. ఈసారి కూడా ఐచ్చికాల నమోదుపై చివరి క్షణం వరకు సస్పెన్స్ తప్పడం లేదు. ఐచ్ఛికాల నమోదుకు కనీసం ఒక రోజు ముందు కూడా కళాశాలలు, సీట్లపై జేఎన్‌టీయూహెచ్‌ సమాచారం ఇవ్వకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

eamcet
eamcet
author img

By

Published : Aug 23, 2022, 7:09 AM IST

Suspense on TS EAMCET Options : ఎంసెట్‌ ఐచ్ఛికాల (ఆప్షన్ల) నమోదుపై ఈసారి కూడా చివరి క్షణం వరకు సస్పెన్స్‌ తప్పడం లేదు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మంగళవారం నుంచి ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కావాలి. ధ్రువపత్రాల పరిశీలన కూడా అదేరోజు ఉదయం 9 గంటలకు మొదలవుతుంది. అయితే ఐచ్ఛికాల నమోదు ప్రారంభ సమయం ఎప్పుడన్నది అధికారులు ప్రకటించలేదు. 145 ఇంజినీరింగ్‌ కళాశాలల తనిఖీలను సోమవారంతో జేఎన్‌టీయూహెచ్‌ పూర్తిచేసింది.

ఆ కళాశాలల జాబితా ఉన్నత విద్యామండలికి చేరితేనే వాటిని కౌన్సెలింగ్‌ వెబ్‌సైట్లో ఉంచుతారు. వర్సిటీ మాత్రం సోమవారం రాత్రి వరకు కళాశాలలు.. వాటిలోని సీట్ల సంఖ్యను పంపలేదు. మంగళవారం మధ్యాహ్నానికి జాబితా పంపినా.. రాత్రికి ఐచ్ఛికాల నమోదును అందుబాటులోకి తీసుకొస్తామని సాంకేతిక విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఐచ్ఛికాల నమోదుకు కనీసం ఒక రోజు ముందు కూడా.. కళాశాలలు, సీట్లపై జేఎన్‌టీయూహెచ్‌ సమాచారం ఇవ్వలేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.