రాష్ట్రంలోని తయారీ, వాణిజ్య, సేవా రంగాల్లో అసంఘటిత సంస్థల పరిస్థితులను అంచనా వేసేందుకు సర్వే చేయనున్నట్లు హైదరాబాద్లోని జాతీయ గణాంక కార్యాలయం అధికారులు తెలిపారు. ప్రతి ఏటా జరిగే ఈ సర్వే ఈ సారి ఏప్రిల్ 01 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు కొనసాగుతుందని వెల్లడించారు.
రాష్ట్రంలోని వ్యాపార వేత్తలు ఈ సర్వేకు సహకరించి దేశాభివృద్ధిలో పాలు పంచుకోవాలని డీడీజీ సతీశ్ కోరారు. కొవిడ్ లాంటి సంక్షోభ పరిస్థితుల్లో ఈ సర్వే ఎంతో కీలకమని.. కరోనా ఎంత మందిపై ప్రభావం చూపిందో తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.