ETV Bharat / city

గాలి జనార్దన్ వ్యాజ్యంపై సుప్రీంలో విచారణ.. తీర్పు రిజర్వు

author img

By

Published : Apr 5, 2021, 5:11 PM IST

బెయిల్ షరతలు సడలించాలన్న గాలి జనార్దన్ రెడ్డి పిటిషన్​పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పు రిజర్వు చేసింది.

supreme
గాలి జనార్దన్

గాలి జనార్దన్​రెడ్డి బెయిల్ షరతుల సడలింపు పిటిషన్​పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. గాలి జనార్దన్​రెడ్డి వేసిన పిటిషన్​పై జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సుభాశ్​రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. బళ్లారి, అనంతపురం, కడప వెళ్లకూడదన్న షరతులను సడలించాలని.. గాలి జనార్ధన్​రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2015 నుంచి ఇప్పటివరకు షరతులు ఉల్లంఘించలేదని ధర్మాసనానికి తెలిపారు. కుటుంబ సభ్యులు బళ్లారిలో ఉన్నారని.. అక్కడకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని గాలి జనార్దన్​రెడ్డి.. సుప్రీంకోర్టును వేడుకున్నారు.

గాలి జనార్దన్​రెడ్డి బెయిల్ షరతులను సడలించవద్దని సీబీఐ వాదించింది. బళ్లారిలో చాలామంది సాక్షులు ఉన్నారనీ.. జనార్దన్​రెడ్డి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ సుప్రీం కోర్టుకు తెలిపింది. ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీం.. తీర్పును రిజర్వు చేసింది.

ఇదీ చూడండి : జగ్జీవన్ రామ్ సేవలు ఎనలేనివి : మంత్రి ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.