దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి సన్‌రైజర్స్ లోగోతో వెలిగిపోయింది. ఐపీఎల్లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ చాలేంజర్స్ బెంగళూరుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించిన సందర్భంగా... బ్రిడ్జ్‌పై విద్యుత్ కాంతులతో సన్‌రైజర్స్ లోగోను ఆవిష్కరించారు. ఇవాళ జరగనున్న రెండో ఎలిమినేటర్ మ్యాచ్‌లోనూ గెలవాలని నగరవాసుల ఆకాంక్షను తెలియజేస్తూ... వంతెన తీగలను సన్‌రైజర్స్ ఆరెంజ్ కలర్ విద్యుత్ దీపాలతో అలంకరించారు.

విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతున్న వంతెన ఫోటోలను పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ ట్విట్టర్లో పెట్టారు. ఈ అలంకరణతో బ్రిడ్జిని చూసి నగర వాసులు ఆనందం వ్యక్తం చేశారు. ఇవాళ రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు... దిల్లితో ఆడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే సన్ రైజర్స్ జట్టు ఫైనల్లో ముంబాయితో తలపడనుంది. ఇప్పటికే హైదరాబాద్ జట్టు ఐపీఎల్ టైటిల్‌ను గెలిచుకోవాలని అభిమానులు... ప్రేక్షకులు ఆకాంక్షిస్తున్నారు.

