ఆదివారం వచ్చిందంటే చాలు హైదరాబాద్ ట్యాంక్‌బండ్ నగరవాసులతో సందడిగా మారుతోంది. నగరంలోని వివిధ ప్రాంతాలను నుంచి కుటుంబ సమేతంగా తరలివస్తోన్న సందర్శకులు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతున్నారు. ట్యాంక్‌బండ్‌పై చిన్నారుల సరదాలు చూస్తూ పెద్దలు మురిసిపోతూ.. తమ పిల్లల తీపి జ్ఞాపకాలను స్మార్ట్‌ఫోన్‌లో బందిస్తున్నారు. వీకెండ్ వచ్చిందంటే ట్యాంక్‌బండ్‌కు పయనమవుతున్న వారంతా.. ఇక్కడికి వస్తే ఓ పర్యాటక ప్రాంతానికి వెళ్లిన అనుభూతి కలుగుతోందని చెబుతున్నారు.
బిజీబిజీ లైఫ్‌తో క్షణం తీరికలేకుండా గడుపుతున్న నగరవాసులకు వారాంతాల్లో కాస్త సేద తీరేందుకు ఓ అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ట్యాంక్‌బండ్ వద్ద సన్ డే ఫన్ డే(Sunday Funday at Tank Bund) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పిల్లలు, పెద్దలు, అందరు కుటుంబ సమేతంగా వచ్చి తమ రెగ్యులర్ లైఫ్ నుంచి కాస్త ఉపశమనం పొందుతున్నారు. విద్యుద్దీపాల అలంకరణలో మెరిసిపోతున్న ట్యాంక్ బండ్‌ను చూస్తూ మైమరిచిపోతున్నారు. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ట్యాంక్‌బండ్‌ను.. రంగులదీపాల కాంతుల్లో చూస్తూ పరవశించిపోతున్నారు.
పిల్లలకు కావాల్సిన ఆట వస్తువులు, పెద్దలకు కావాల్సిన యాక్సెసరీస్, నోరూరించే వంటకాలు.. ఇవన్నీ నగరవాసులను ఆదివారం వచ్చిందంటే ట్యాంక్ బండ్ వైపునకు మర్లేలా చేస్తోంది. గతంలో కంటే ట్యాంక్‌బండ్ ఇప్పుడు చాలా బాగుందని అంటున్నారు నగరవాసులు. ఆదివారం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నామని చెబుతున్నారు. ఒకప్పుడు ట్యాంక్‌బండ్‌పైకి రావాలంటే రద్దీ వల్ల భయంగా ఉండేదని..ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని అంటున్నారు.
సన్ డే ఈజ్ ఫన్ డే కార్యక్రమం(Sunday Funday at Tank Bund) చాలా బాగుందని.. ఇక్కడ అన్నీ రకాలైన వస్తువులు లభించడంతో పాటు కుటుంబంతో కలిసి కాలక్షేపం చేసేందుకు కావాల్సిన అన్నీ రకాలైన ఏర్పాట్లు చేశారని నగరవాసులు అంటున్నారు. ఈ కార్యక్రమం కొత్తగా ఉందని.. ఇలాంటివి మరికొన్ని కార్యక్రమాలు చేపడితే.. తమ ఉరుకుల పరుగుల జీవితం నుంచి కాస్త రీఫ్రెష్ అవుతామని చెబుతున్నారు.
- ఇదీ చదవండి : అవి రెండే ముఖ్యమని అర్థం చేసుకున్నా: మెహ్రీన్