ETV Bharat / city

TET Syllabus: టెట్‌ సిలబస్‌ ఇదే.. సబ్జెక్టుల వారిగా పూర్తి సమాచారం..

టెట్‌ సిలబస్‌లో ఎటువంటి మార్పూ లేదు. ఈ మేరకు టీఎస్‌ టెట్‌ వెబ్‌సైట్​లో పూర్తి సిలబస్‌ను ఉంచారు. టెట్‌లో రెండు పేపర్లు ఉంటాయి. అందులో పేపర్‌-1 సెకండరీ గ్రేడ్‌ టీచర్లుగా నియామకానికి, పేపర్‌-2 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల కోసం అర్హత సాధించేందుకు నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌ 150 మార్కులకు ఉంటుంది. పేపర్‌-1కు 1-8 తరగతులు, పేపర్‌-2కు 6-10 తరగతుల ప్రామాణికంగా ప్రశ్నలు ఉంటాయి.

Subject wise Syllabus for TET
Subject wise Syllabus for TET
author img

By

Published : Mar 26, 2022, 8:11 AM IST

పేపర్‌-1 సిలబస్‌ ఇదీ...

  • శిశు అభివృద్ధి, బోధన శాస్త్రం (30 మార్కులు): శిశు అభివృద్ధి నమూనాలు, నేర్చుకునే సామర్థ్యం, బోధన శాస్త్ర అవగాహన
  • తెలుగు భాష (30 మార్కులు) : పఠనావగాహన, తెలంగాణ సాహిత్యం, సంస్కృతి, పదజాలం, భాషాంశాలు, బోధన పద్ధతులు
  • ఆంగ్ల భాష (30 మార్కులు) : ఆంగ్లభాష విషయాలు, వ్యాకరణం (24 మార్కులు), ఆంగ్ల బోధన శాస్త్రం (6 మార్కులు)
  • గణితశాస్త్రం (30 మార్కులు) : సంఖ్యామానం, భిన్నాలు, అంకగణితం, రేఖాగణితం, కొలతలు, డేటా అప్లికేషన్స్‌, ఆల్‌జీబ్రా (24 మార్కులు), గణిత బోధన పద్ధతులు (6 మార్కులు)
  • పర్యావరణ అధ్యయనం (30 మార్కులు) : నా కుటుంబం, పని, ఆటలు, మొక్కలు, జంతువులు, మన ఆహారం, వసతి, గాలి, ఇంధనం, నీరు, ఆరోగ్యం, పరిశుభ్రత, భౌగోళిక మ్యాపులు, భారత దేశ చరిత్ర- సంస్కృతి, భారతదేశం- తెలంగాణ సంస్కృతి, పట్టణాలు, జీవన విధానం, సహజవనరులు, నదులు, నాగరికత, భారత రాజ్యాంగం, భద్రత (భూకంపాలు, వరదలు, ఆగ్నిమాపక, ప్రాథమిక చికిత్స, 108, 104 వాహనాలు) (24 మార్కులు), పర్యావరణ బోధన శాస్త్రం (6మార్కులు)

పేపర్‌-2 సిలబస్‌( సైన్స్‌, సోషల్‌)

  • శిశు అభివృద్ధి, బోధన శాస్త్రం(30 మార్కులు): శిశు వికాసం, వ్యక్తిత్వ వికాసం, ప్రవర్తనా సమస్యలు, నేర్చుకునే సామర్థ్యం, మానసిక ఆరోగ్యం బోధన శాస్త్ర అవగాహన తదితర అంశాలు ఉంటాయి.
  • తెలుగు భాష( 30 మార్కులు): పఠనావగాహన(పద్యం, గద్యం), 2015లో రూపొందించిన పాఠ్య పుస్తకాల ఆధారంగా తెలంగాణ సాహిత్యం, సంస్కృతి(ప్రాచీనం, ఆధునికం), పదజాలం, భాషాంశాలు, బోధన పద్ధతులు
  • ఆంగ్ల భాష (30 మార్కులు) : ఆంగ్లంలోని పార్ట్స్‌ ఆఫ్‌ స్వీచ్‌, టెన్సెస్‌, యాక్టివ్‌ వాయిస్‌, పాసివ్‌ వాయిస్‌, డిగ్రీస్‌ ఆఫ్‌ కంపారిజన్‌, వెర్బ్‌లు తదితర మొత్తం 20 రకాల వ్యాకరణాంశాలు. వాటికి 24 మార్కులు. మరో 6 మార్కులు ఆంగ్ల బోధనా పద్ధతులకు ఉంటాయి.
  • గణితం, సైన్స్‌( 60 మార్కులు): గణితానికి 30, సైన్స్‌కు 30 మార్కులుంటాయి. గణితంలో సంఖ్యామానం, అంకగణితం, సెట్స్‌, అల్‌జీబ్రా, రేఖాగణితం(జామెట్రీ), మెన్సురేషన్‌, డేటా హ్యాండ్లింగ్‌, త్రికోణమితి, గణిత బోధన పద్ధతులు.
  • సైన్స్‌లో: ప్రకృతి వనరులు, మన విశ్వం, మెకానిక్స్‌, మేగ్నటిజం అండ్‌ ఎలక్ట్రిసిటీ, మూలకాల వర్గీకరణ, రసాయన బంధం, పదార్థం, అణు నిర్మాణం, జీవశాస్త్రం తదితర అంశాలు.
  • పేపర్‌-2లో సోషల్‌ స్టడీస్‌(60 మార్కులు): భూ వైవిధ్యం, ఉత్పత్తి- వలసలు, జీవనోపాధి, రాజకీయ వ్యవస్థలు, సామాజిక అసమానతలు, మతం- సమాజం, సంస్కృతి-కమ్యూనికేషన్‌ తదితర అంశాలకు 48 మార్కులు ఉంటాయి. మరో 12 మార్కులు బోధన పద్ధతులకు ఉంటాయి.

ఇదీ చూడండి: కరెంటు ఉద్యోగుల కాసుల కక్కుర్తి.. పని ఏదైనా పైసలివ్వాల్సిందే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.