ETV Bharat / city

నేటి నుంచి మరింత రద్దీగా మారనున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు

author img

By

Published : Dec 30, 2020, 5:08 AM IST

రాష్ట్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు.. నేటి నుంచి మరింత రద్దీగా మారనున్నాయి. అనుమతులు లేని క్రమబద్ధీకరణ కానీ పాత ప్లాట్లు... నిర్మాణాలు రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో రిజిస్ట్రేషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. తాజాగా రోజుకు మూడు వేలకు పైగా రిజిస్ట్రేషన్లు అవుతుండగా... నేటి నుంచి మూడున్నర వేల నుంచి నాలుగు వేలు రిజిస్ట్రేషన్లు అయ్యేందుకు అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

నేటి నుంచి మరింత రద్దీగా మారనున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు
నేటి నుంచి మరింత రద్దీగా మారనున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు

ఎల్​ఆర్​ఎస్​ లేకుండానే భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐతే పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ అనుమతులు లేని.. క్రమబద్ధీకరణ లేని ప్లాట్లు, నిర్మాణాల రిజిస్ట్రేషన్లు చేయలేదు. క్షేత్రస్థాయిలో ప్రజల ఇబ్బందులు, విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకొని.. రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను సడలించింది. ఇప్పటివరకు పాత పద్ధతిలో మంగళవారం వరకు జరిగిన 25 వేల 932 రిజిస్ట్రేషన్లు జరిగితే... 775.69 కోట్లు ఆదాయం సమకూరింది. 3 నెలలకుపైగా విరామం తర్వాత పాత విధానంలో కార్డు ద్వారా కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ల ప్రక్రియతో.. రాష్ట్రంలోని 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు రద్దీగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే అంచనాకు మించి రోజువారీగా రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా... నేటి నుంచి రిజిస్ట్రేషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

మంగళ వారం వరకు 25 వేల 932 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద 278.12 కోట్లు.. స్టాంపుల విక్రయాల ద్వారా మరో 497.46 కోట్లు.. మొత్తం కలిపి 775.69 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. గత వారం వరకు జరిగిన రిజిస్ట్రేషన్ల ద్వారా రోజుకు వంద కోట్లుకుపైగా రాబడి వస్తోంది. ఈ వారంలో సోమ, మంగళవారం రెండు రోజుల్లో రాష్ట్రంలోని.. 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 6 వేల 312 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగాయి. తాజాగా నేటి నుంచి అనుమతి లేని, క్రమబద్ధీకరణ కాని.. పాత ప్లాట్లు, భవనాలు రిజిస్ట్రేషన్ కానుండడంతో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసుకోవాలని.. రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశించారు. ప్రధానంగా హైదరాబాద్ నగర శివారులోని.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఎక్కువ రద్దీ ఉంటుందని తెలిపారు.

ఇదీ చదవండి: వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.