ETV Bharat / city

Sub Committee for Projects Management : గెజిట్ అమలు, ప్రాజెక్టుల నిర్వహణపై అధ్యయనానికి ఉపసంఘం - తెలంగాణ-ఏపీ జలవివాదం

కృష్ణా, గోదావరి నదులపై నిర్మించిన ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు సహా కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల నిర్వహణ విషయమై అధ్యయనం కోసం రాష్ట్ర సర్కార్ ఉపసంఘాన్ని(Sub Committee for Projects Management) ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రాధాన్యాలు, నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని బోర్డుకు తగిన సిఫారసు చేయాలని ఉపసంఘాన్ని ప్రభుత్వం ఆదేశించింది.

Sub Committee for Projects Management
Sub Committee for Projects Management
author img

By

Published : Oct 14, 2021, 9:58 AM IST

కృష్ణా, గోదావరి పరిధిలోని ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు సహా కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల నిర్వహణ విషయమై అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉపసంఘాన్ని(Sub Committee for Projects Management) ఏర్పాటు చేసింది. నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ నేతృత్వంలో సబ్ కమిటీ(Sub Committee for Projects Management) ఏర్పాటైంది. గెజిట్ నోటిఫికేషన్ నేపథ్యంలో సంబంధిత అంశాలు, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నిర్వహణ, సీడబ్ల్యూసీ ఆపరేషన్ ప్రొటోకాల్స్​పై ఉపసంఘం దృష్టి సారించాల్సి ఉంటుంది. సబ్ కమిటీ(Sub Committee for Projects Management)లో సభ్యులుగా.. సీఈలు మోహన్ కుమార్, శ్రీకాంత్ రావు, నిపుణులు ఎం.ఏ. రవూఫ్, ఘనశ్యాం ఝా, కన్సల్టెంట్ చేతన్ పండిట్, సీనియర్ న్యాయవాది రవీందర్ రావు ఉన్నారు.

ముసాయిదా నిబంధనలు, ఆపరేషన్ ప్రొటోకాల్స్​ను ఉపసంఘం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ ముందు రాష్ట్రం వాదిస్తున్న అంశాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రయోజనాలు, ప్రాధాన్యాలు, నీటి అవసరాలకు ప్రాముఖ్యతనిచ్చేలా తగిన సిఫారసు చేయాలని ఉపసంఘాన్ని(Sub Committee for Projects Management) రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నెల 30వ తేదీ లోపు నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.