మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థుల మధ్య వివాదం జరిగింది. బయట వ్యక్తులు వచ్చి విద్యార్థి సాయి సుమంత్ పై దాడి చేశారు. ఈ ఘటనలో యువకుడి చేయి విరిగింది. తోటి విద్యార్థులు మేడిపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఘట్కేసర్ పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండిః పరీక్షలు మళ్లీ వస్తాయి... ప్రాణాలు రావు: హరీశ్ రావు