ETV Bharat / city

Youtube Channels: ఈ ఛానెళ్లు అన్నదాత కోసమే..

రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. కానీ సాగులో మెలకువలు నేర్వని కర్షకులు కష్టాల్ని ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో కొందరు అన్నదాతలు ఆధునికతను ఒంటబట్టించుకుని సిరులు పండిస్తున్నారు. అలాంటి రైతుల విజయగాథల్ని అందిస్తున్నాయి కొన్ని యూట్యూబ్‌ ఛానెళ్లు. అవేంటో..? వాటి కథేంటో..? తెలుసుకుందాం పదండి.

YouTube channels for agriculture
రైతుల కోసం ప్రత్యేక యూట్యాబ్‌ ఛానెళ్లు
author img

By

Published : Jun 20, 2021, 2:30 PM IST

తెలుగు రాష్ట్రాల్లో రైతుల్ని చైతన్యవంతుల్ని చేసే ఉద్దేశంతో ఏర్పాటైన సంస్థ ‘రైతు నేస్తం ఫౌండేషన్‌’. ‘రైతు నేస్తం’ మాస పత్రికను తీసుకొచ్చే ఈ సంస్థ అదే పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌నీ నిర్వహిస్తోంది. దీనిద్వారా తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి, సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతుల అనుభవాల్నీ విజయగాథల్నీ తెలియజేస్తున్నారు పద్మశ్రీ యడ్లపాటి వెంకటేశ్వరరావు. కొత్తగా ఈ రంగంలోకి అడుగుపెట్టాలనుకుంటున్నవారికీ, ఇప్పటికే సాగుచేస్తూ కొత్త పథంలో నడవాలనుకుంటున్నవారికీ ఇక్కడ విలువైన సమాచారం దొరుకుతుంది.

వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌లో మెలకువలూ, రైతులకు ఉపయోగపడే ఆధునిక వ్యవసాయ సాధనాలూ, యంత్రాల సమాచారం మనకు కనిపిస్తుంది. ప్రకృతి వ్యవసాయంలో ఉపయోగపడే కషాయాల తయారీ సమాచారం, సేంద్రియ విత్తనాలు అందించే రైతుల వివరాలూ తెలుస్తాయి. అంతర పంటల సమాచారం, పర్మాకల్చర్‌ లాంటి విషయాలు తెలిపే వీడియోలు ఉంటాయి. వ్యవసాయంలో కీలకమైన భూసార పరీక్షలూ, భూ సంరక్షణకు సంబంధించి అవలంబించాల్సిన విధానాలపైన నిపుణుల సూచనలూ.. సలహాలూ తెలుసు కోవచ్చు. సాగు విధానాలపైన ఈ సంస్థ నిర్వహించే శిక్షణ కార్యక్రమాల వీడియోలు అందుబాటులో ఉంటాయి. సీజన్ల వారీగా వ్యవసాయ నిపుణులూ, శాస్త్రవేత్తలతో లైవ్‌ కార్యక్రమాలు నిర్వహించి రైతుల సందేహాల్ని నివృత్తి చేస్తుంటారు. తృణ ధాన్యాలతో ఆరోగ్య కరమైన వంటకాల తయారీ వీడియోలూ ఉండటం విశేషం.

ఆన్‌లైన్‌ కర్షక మిత్ర...

రైతంటే ఏ ఒక్క పంటనో సాగుచేయడం కాదు, నేటి కాలంలో సమగ్ర వ్యవసాయమే అతడిని ఆర్థికంగా నిలబెడుతుంది. అలాంటి సమగ్ర వ్యవసాయం చేస్తున్న రైతుల గురించి తెలుసుకోవాలంటే ‘కర్షకమిత్ర’ యూట్యూబ్‌ ఛానెల్‌ని చూడాల్సిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మెచ్చిన ఆంధ్ర రైతు ఉప్పలపాడు ప్రసాద్‌రావు వ్యవసాయంతో పాటు మేకలు, గేదెల పెంపకం ఎందుకు చేపడుతున్నారో.. ఎలా చేపడుతున్నారో తెలుసుకోవాలంటే ‘కర్షక మిత్ర’ వీడియోల్ని చూడాల్సిందే.

బ్లాక్‌ బెంగాల్‌ మేకల్ని, స్ఫూర్తి రకంతో సంకరణం చేయడంవల్ల షెడ్లలోనే మేకల్ని పెంచుతూ అధిక లాభాల్ని పొందుతున్న విషయాన్ని చెబుతారు ప్రసాద్‌రావు. సీజన్‌ ప్రారంభంలోనే మామిడి దిగుబడి, మామిడికి కాగితం కవరు తొడగడం, దశాబ్దాల వయసున్న మామిడి చెట్లకు కొమ్మలు తొలగించి వాటిని పునరుద్ధరించడం లాంటి అంశాల్లో మామిడి రైతులు ఏం చేస్తున్నారో ఈ విడియోల్లో చూడొచ్చు. నేరేడు సాగు లాంటి వీడియోలతోపాటు 30 ఏళ్లుగా నాటుకోళ్లు పెంచుతూ ముందుకు వెళ్తున్న రైతు విజయం, డైరీ పరిశ్రమలో లాభాలు ఆర్జిస్తున్న రైతులూ, పుంగనూరు ఆవుల్ని పెంచుతున్న రైతు... లాంటి వీడియోలు ఆలోచింపజేస్తాయి. ఎర్త్‌ ఆగర్స్‌, పవర్‌ వీడర్‌, మినీ ట్రాక్టర్‌ లాంటి సాధనాలతో వ్యవసాయం ఎలా సులభతరం అవుతుందో చూపే వీడియోలూ పెడుతున్నారు ఈ ఛానెల్‌ నిర్వాహకులు మాగంటి వీరాంజనేయులు.

డిజిటల్‌ రైతుబడి

వైపు ఐటీ ఉద్యోగం(వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌) చేస్తూనే సేంద్రియ సాగు చేస్తున్న నల్గొండ యువ సాఫ్ట్‌ రైతుల గురించి తెలుసుకోవాలంటే ‘తెలుగు రైతుబడి’ ఛానెల్‌ చూడాల్సిందే. అనుభవజ్ఞులైన అన్నదాతలతోపాటు ఇలాంటి యువ రైతులు అవలంబిస్తున్న సాగు విధానాల గురించి ఈ ఛానెల్‌లో ఎక్కువగా వీడియోలు కనిపిస్తాయి. కూరగాయలూ, ఆకుకూరలతోపాటు పుచ్చకాయ, అంజీర్‌, జామ, బొప్పాయి, బత్తాయి, డ్రాగన్‌ ఫ్రూట్‌ లాంటి భిన్నమైన పండ్లు సాగు చేస్తున్న రైతుల అనుభవ పాఠాలకు ఈ ఛానెల్‌ ప్రత్యేకం. ఒక్కసారి నాటితే 60 సార్లు కోసుకునే వీలుండే పుదీనా తెస్తున్న లాభాల గురించి రైతు రాములు మాటల్లో వినాల్సిందే. అలొవెరా, ఆయిల్‌ పామ్‌ లాంటి వాణిజ్య పంటలూ, ఎర్ర చందనం, శ్రీ గంధం, టేకు లాంటి దీర్ఘకాలంలో ఆదాయం తెచ్చే మొక్కల పెంపకం గురించి రైతుల అమూల్యమైన అనుభవాల్ని దీన్లో చూడొచ్చు. నాటుకోళ్లూ, కుందేళ్ల పెంపకంతో లాభాలు ఆర్జిస్తున్న రైతుల విజయగాథల్నీ వినొచ్చు. వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన విజ్ఞానాన్నీ ఈ ఛానెల్‌ ద్వారా తెలియజేస్తున్నారు రాజేందర్‌ రెడ్డి జూలకంటి. అల్లంతోపాటు అరటి, బొప్పాయి... అలొవెరాకు తోడుగా జామ, ఉలవలూ... ఇలా అంతరపంటల గురించీ ఎన్నో విషయాలు తెలుస్తాయి. రైతులు తాము పడ్డ కష్టాల్నీ, వాటిని అధిగమించడానికి కనిపెట్టిన మార్గాల్నీ చెబుతుంటే రైతుని రాజు అనాల్సిందే. పొలం చుట్టూ ఎలాంటి పంటలకు ఏ రకమైన ఫెన్సింగ్‌ వేసుకోవాలి లాంటి విషయాల్నీ చెబుతున్నారు.

ఇదీ చదవండి: SCHOOLS OPEN: పొంచి ఉన్న కరోనా మూడో దశ ముప్పు.. విద్యాసంస్థల రీఓపెన్​ అవసరమా ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.