ETV Bharat / city

తెలంగాణలో వెలుగుల జిలుగుల 'సౌర'భం - Solar power on subsidy in Telangana

తెలంగాణలో సౌర వెలుగులు విరజిమ్ముతున్నాయి. పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ.. ఒక పక్క ప్రభుత్వ కార్యాలయాల్లో సౌర ఫలకాల ఏర్పాటుపై దృష్టి సారిస్తూనే.. మరోపక్క గృహ వినియోగదారులకు ప్రత్యేక సబ్సిడీని అందజేస్తోంది. దీంతో వినియోగదారులు తమ భవనాలపై సౌర ఫలకలను ఏర్పాటు చేసుకునేందుకు మక్కువ చూపిస్తున్నారు. గడిచిన ఆరేళ్లలో ఇంటి పైకప్పుపై 148.63 మెగావాట్ల సౌర ఫలకలను ఏర్పాటు చేసుకున్నారు.

solar power usage in telangana is gradually increasing
తెలంగాణలో సౌర వెలుగుల జిలుగులు
author img

By

Published : Jan 27, 2021, 8:58 AM IST

సౌర విద్యుత్ వినియోగంపై పునరుత్పాదక ఇంధన అభివృద్ది సంస్థ దృష్టి సారించింది. గృహ వినియోగదారులకు సోలార్ విద్యుత్​పై అవగాహన కల్పిస్తోంది. ప్రోత్సాహకాలను ప్రకటిస్తూ.. వారిని ప్రోత్సహిస్తోంది. ఇంటి పైకప్పుపై సౌర విద్యుత్ వినియోగించే గృహ వినియోగదారులకు 3 కిలోవాట్ల వరకు 40 శాతం సబ్సిడీ అందజేస్తోంది. 3 నుంచి 10 కిలోవాట్ల వరకు వినియోగించే వారికి ఇంధన అభివృద్ధి సంస్థ అధికారులు 20 శాతం సబ్సిడీ అందజేస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీలో లిఫ్ట్​లు, వీధి దీపాలు, మంచినీటి వినియోగం కోసం 20 శాతం సబ్సిడీ ఇస్తున్నారు.

గృహ వినియోగదారులు, గేటెడ్ కమ్యూనిటీలో సౌర విద్యుత్​ను వినియోగించుకున్న తర్వాత ఇంకా మిగులు విద్యుత్ ఉంటే.. దాన్ని తిరిగి విద్యుత్ శాఖ వారికి అమ్ముకోవచ్చు. ఇందుకోసం నెట్ మీటరింగ్ అందుబాటులోకి తీసుకొచ్చారు. యూనిట్​కు రూ.4.18 పైసలు విద్యుత్ శాఖ చెల్లించే విధంగా అంగీకారం కూడా కుదుర్చుకున్నట్లు రెడ్కో వివరించింది. బహిరంగ మార్కెట్​లో సోలార్ ప్యానెళ్లు తక్కువ ధరకే దొరుకుతుండటం వల్ల పరిశ్రమలకు రాయితీ ఇవ్వడం లేదని రెడ్కో వర్గాలు వెల్లడించాయి. పరిశ్రమలకు ఒక మెగావాట్ వరకు సోలార్ పవర్ విద్యుత్​ను వినియోగించుకునే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు.

ప్రభుత్వ సంస్థల్లో సౌర విద్యుత్​ను ఎక్కువగా వినియోగిస్తున్నారని రెడ్కో వెల్లడించింది.

సంస్థలుసౌర విద్యుత్ వినియోగం
టీఎస్.ఆర్టీసీ బస్ డిపో4,200కిలోవాట్స్
నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ250 కిలోవాట్స్
నల్సార్ లా యూనివర్సిటీ200 కిలోవాట్స్
ఎం.సీఆర్-హెచ్.ఆర్.డీ850 కిలోవాట్స్
డాక్టర్.బీ.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ300 కిలోవాట్స్
టీఎస్ పోలీస్ అకాడమీ320 కిలోవాట్స్
ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్జ్ ఇన్స్​స్టిట్యూషన్200 కిలోవాట్స్
మెట్రో పాలిటన్ సెషన్స్ జడ్జ్ కోర్ట్ కాంప్లెక్స్200 కిలోవాట్స్
జీహెచ్.ఎంసీ941 కిలోవాట్స్
వెల్పేర్ అసోసియేషన్ ఆఫ్ రెయిన్ పార్క్400 కిలోవాట్స్
రాజ్ భవన్ ఏ టైప్ క్వార్టర్స్243 కిలోవాట్స్
సంవత్సరంసౌర విద్యుత్ ఉత్పత్తి
2014-15లో4.1435 మెగావాట్లు
2015-16లో5.7749మెగావాట్లు
2016-17లో7.901 మెగావాట్లు
2017-18లో13.1145 మెగావాట్లు
2018-19లో41.8861మెగావాట్లు
2019-20లో45.4004మెగావాట్లు
2020-21లో30.4096మెగావాట్లు
మొత్తం148.63 మెగావాట్లు

రాష్ట్ర ఆవిర్భానికి ముందు ఇంటి పైకప్పు లో సోలార్ విద్యుత్ వినియోగంపై దృష్టిసారించలేదు. రాష్ట్ర ఆవిర్బావం తర్వాత పునరుత్పాదక ఇంధన అభివృద్ది సంస్థ దీనిపై ప్రత్యేక దృష్టిసారించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.