కానిస్టేబుల్, ఎస్సై పోస్టుల ఎంపిక ప్రక్రియలో అవకతవకలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ బషీర్‌బాగ్ క్లబ్లో ఎస్సై అభ్యర్థులు సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో తెజస అధ్యక్షుడు ప్రొ.కోదండరాం, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పాల్గొన్నారు. ఆర్ఎఫ్ఐడీ సిస్టంలో తప్పుల వల్ల ఎంపికలో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు వాపోతున్నారు.
అరెస్టులు అన్యాయం
ఎస్సై పరీక్షలో అవకతవకలపై ప్రశ్నించిన అభ్యర్థులను అరెస్టు చేయడం అన్యాయమని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. తక్షణమే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షలో అభ్యర్థుల సందేహాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
కొంతమందిని కావాలనే ఈవెంట్స్‌లో క్వాలిఫై చేస్తున్నారని ఎస్సై అభ్యర్థులు ఆరోపించారు. ప్రశ్నిస్తే క్రిమినల్ కేసులు పెడతామని బెదిరిస్తున్నట్లు తెలిపారు. తమకు న్యాయం చేయాలని కోరారు.
ఎస్సై అభ్యర్థులు ఆందోళన నేపథ్యంలో బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్లో పోలీసులు భారీగా మోహరించారు.
ఇవీ చూడండి: ఏర్పాట్లు పూర్తి... త్వరలో నోటిఫికేషన్