ETV Bharat / city

శంషాబాద్ కిడ్నాప్ కథ సుఖాంతం - dcp

నాలుగు రోజుల క్రితం కిడ్నాప్​కు గురైన బాలున్ని పోలీసులు రక్షించారు. చాకచక్యంగా వ్యవహరించి ఆరుగురు నిందితులను పట్టుకున్నారు. బాబును తల్లిదండ్రులకు అప్పగించారు. నాలుగు రోజులుగా కనిపించకుండా పోయిన తన బిడ్డ తిరిగి రావడం వల్ల తల్లిదండ్రుల అనందానికి అవధులు లేకుండా పోయాయి. సీసీటీవీ ఫుటేజ్ అధారంగా కేసును ఛేదించిన సిబ్బందికి శంషాబాద్​ డీసీపీ ప్రకాశ్​ రెడ్డి రివార్డు అందించారు.

బాబుతో డీసీపీ
author img

By

Published : Aug 10, 2019, 7:07 PM IST

శంషాబాద్ కిడ్నాప్ కథ సుఖాంతం

నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన నగేశ్​, తేజ దంపతులకు పిల్లలు లేరు. ఆ విషయం హైదరాబాద్​లో ఉంటున్న తమ బంధువు కొండ లలితతో చెప్పారు. డబ్బులు ఇస్తే ఓ బాబును ఇప్పిస్తానని చెప్పింది లలిత. పని మీద శంషాబాద్ వచ్చిన లలిత.. కల్యాణ్ అనే వ్యక్తిని పరిచయం చేసుకుని తమకు ఓ పిల్లాడు కావాలని చెప్పింది.

కిడ్నాప్​

ఈ నెల 6న శంషాబాద్ తహసీల్దార్​ కార్యాలయం వద్ద తనకు పరిచయమున్న వెంకటమ్మ అనే మహిళ కొడుకును కల్యాణ్ కిడ్నాప్ చేశాడు. బిడ్డ కనబడడం లేదంటూ వెంకటమ్మ ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్​ ఆధారంగా నిందితులు గొర్రెల కల్యాణ్, సారంగి రాజు, సారంగి వసంత, కొండ లలిత, కొండ నగేశ్​, కొండ తేజను అరెస్ట్​ చేశారు.

తల్లిదండ్రులకు అప్పగింత

బాబును క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. తమ బిడ్డను చూసిన తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. పిల్లాన్ని రక్షించినందుకు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. కేసును ఛేదించిన ఎస్సై, కానిస్టేబుళ్లకు శంషాబాద్​ డీసీపీ ప్రకాశ్​ రెడ్డి రివార్డులు అందజేశారు.

ఇదీ చూడండి : శ్రీశైలంలో జలదృశ్యం- 10 గేట్ల నుంచి ప్రవాహం

TG_HYD_30_10_boy kidnap tress_ab_TS10020. M.Bhujangareddy.8008840002. (Rajendra nagar) యాంకర్.... నాలుగు రోజుల క్రితం జరిగిన కుమార్ అనే సంవత్సరం నర బాబు కిడ్నప్ కేసును చేదించారు పోలీసులు. ఆరు మంది నింధితులను అరెస్ట్ చేసి బాబును తల్లిదండ్రుల వడికి చేర్చారు. నాలుగు రోజులుగా కనిపించకుండా పోయిన తన బిడ్డ తిరిగి రావడంతో తల్లిదండ్రుల అనందానికి అవదులు లేకుండా పోయాయి. సిసి టీవి ఫుటేజ్ అధారంగా కేసును చేందిన పోలీసు సిబ్బంధికి రివార్డులను అందజేశారు శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి. వాయిస్... నల్గొండ జిల్లా దేవరకోండ ప్రాంతానికి చెందిన నగేష్ తేజ దంపతులకు పిల్లలు కలగలేదు. అయితే అ విషయం హైదరాబాదు లో ఉంటుంన్న తమ బందువు కోండలలితతో చెప్పారు. తమ అర్దిక స్థోమత చూస్తే ఎవరు కూడా పిల్లలను దత్తతకు ఇవ్వరని కొన్ని డబ్బులు కర్చు పెడితే ఒ బాబును ఇప్పిస్తానని చెప్పింది లలిత. పనిమీద శంషాబాద్ వచ్చిన లలిత కల్యాణ్ అనే వ్వక్తిని పరిచయం చేసుకుని తమకు ఒ పిల్లాడు కావాలి నీకు డబ్బులు బైక్ కొనిస్తానని చెప్పింది దానికి ఒప్పుకున్న కల్యాణ్ పథకం వేశాడు. కల్యాణ్ కు పరిచయమున్న వెంకటమ్మ 6వ తేదిన శంషాబాద్ MRO ఆఫిసు వద్ద తన గుడిసెలో బిడ్డతో కలిసి నిద్రస్తుండగా పసిగట్టిన కల్యాణ్ పిడ్డను కిడ్నప్ చేసి లలితకు ఇచ్చాడు. బిడ్డ కనబడడం లేదంటు వెంకటమ్మ ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో కిడ్నప్ కేసు నమోదు చేసుకుని టీములుగా ఏర్పడి సిసి కెమరాల ద్వారా నిందితులను A1 గొరెల కల్యాణ్ A2 సారంగి రాజు A3 సారంగి వసంత A4 కొండ లలిత A5 కొండ నగేష్ A6 కొండ తేజ లను అదుపులోకి తీసుకుని బాబును క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. తమ బిడ్డను చూసిన తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తూ తమ బిడ్డను క్షేమంగా తమకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కేసును చేదించిన ఎస్సైలకు కానిస్టేబులకు రివార్డులు అందజేశారు శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి. బైట్:- డిసిపి ప్రకాష్ రెడ్డి.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.