ETV Bharat / city

sexual harassment : స్పెల్లింగులు నేర్పిస్తాన‌ని విద్యార్థినులను గదిలోకి పిలిచి..! - అకృత్యాలు

విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే అకృత్యాలకు పాల్పడుతూ స‌భ్య స‌మాజానికి మచ్చ తెస్తున్నారు. కామంతో కళ్లు మూసుకున్న ఉపాధ్యాయులు అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే గుజ‌రాత్​లోని రాజ్‌కోట్‌లో జ‌రిగింది.

sexual harassment
sexual harassment
author img

By

Published : Oct 5, 2021, 5:37 PM IST

స్పెల్లింగులు నేర్పిస్తాన‌ని చెప్పి విద్యార్థినుల‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు ఓ పాఠ‌శాల డైరెక్ట‌ర్ దినేశ్ జోషి. గుజ‌రాత్​ రాజ్‌కోట్‌ లోధిక తాలుకాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో దినేశ్ జోషి డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. స్పెల్లింగులు నేర్పిస్తాన‌ని ఇద్దరు విద్యార్థినుల‌ను తన గదికి పిలిచాడు. తన నిజస్వరూపం తెలియని చిన్నారులు ఆ గదికి వెళ్లగా.. అఘాయిత్యానికి ఒడిగట్టాడు.

తన శరీర భాగాలను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడని ఓ బాలిక తన తల్లికి చెప్పుకుంది. గ‌తంలోనూ ఇలాగే ప్ర‌వ‌ర్తించాడ‌ని.. ఇత‌ర అమ్మాయిల‌తోనూ ఇలాగే ప్ర‌వ‌ర్తిస్తుంటాడ‌ని వాపోయింది. విషయం తెలుసుకున్న విద్యార్థినుల త‌ల్లిదండ్రులు లోధిక పోలీస్ స్టేష‌న్​లో ఫిర్యాదు చేశారు. జోషిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: ఒక్కడే 75 మందిని పెళ్లాడి.. 200 మంది అమ్మాయిల్ని...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.