తమకు ఐదు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ సేవేరేజీ కార్మికులు హైదరాబాద్ ఎల్బీనగర్ జోన్ కార్యాలయం ముందు సేవేరేజీ కార్మికులు ఆందోళనకు దిగారు. సిద్ధు అనే కార్మికుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. పక్కనున్న వారు అడ్డుకున్నారు. తమకు ఐదు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సృజన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ కాంట్రాక్టర్ సాయి కిరణ్ రెడ్డిని జీతాలు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కులం పేరుతో దూషిస్తున్నారని.. అసభ్యకరమైన మాటలు మాట్లాడుతున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
18 నెలలుగా సేవేరేజి వర్కర్లుగా పని చేస్తున్నామని అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. జీతాలు ఇవ్వకుంటే తమ కుటుంబాని ఎలా పూట గడుస్తుందని వాపోయారు. పని చేయించుకుని ఉద్యోగుల నుంచి తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. తమ సమస్యపై అధికారుల దృష్టికి, రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు. తమకు ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు. జీతాలు చెల్లించకపోతే ఆత్మహత్యలే శరణ్యమని కార్మికులు అన్నారు.
2020 మార్చి నుంచి విధులు నిర్వహిస్తున్నాం. కరోనా సమయంలో పని చేశాం. ఏడు నెలలు పని చేయించుకున్నారు. మాకొచ్చే రూ.10 వేల పీఎఫ్, ఈఎస్ఐ కోసం 2 వేల రూపాయలు కట్ చేశారు. ఇచ్చే రూ.8 వేలు కాడా ఇవ్వలేదు. పీఎఫ్, ఈఎస్ఐ లేకుండా చేశారు. ఉద్యోగం నుంచి తీసేశారు.
-సిద్ధు కార్మికుడు
ఇదీ చదవండి: MLC ELECTION: ఈ సమయంలో సాధ్యం కాదు.. ఈసీకి ప్రభుత్వం లేఖ