ETV Bharat / city

ఇక నుంచి అన్ని పాఠశాలల్లో తెలుగు తప్పనిసరి.. బోధించకపోతే..

author img

By

Published : Jul 9, 2022, 11:55 AM IST

ఒకటి నుంచి పదో తరగతి వరకు తెలుగును ఓ సబ్జెక్టుగా తప్పనిసరిగా బోధించాలని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర పాఠశాలలతో పాటు సీబీఎస్​ఈ, ఐసీఎస్​ఈ, ఐబీ పాఠశాలలు కూడా కచ్చితంగా అమలు చేయాల్సిందేనని ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఎస్​ఈ తదితర బోర్డుల పాఠశాలల పదో తరగతి విద్యార్థులు పరీక్షల్లో ద్వితీయ భాషగా తెలుగును రాయాల్సిందేనని పేర్కొంది. తెలుగు సబ్జెక్టు బోధన అమలు చేయకపోతే చర్యలు తప్పవని స్పష్టం చేసింది.

telugu
telugu

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఈ ఏడాది నుంచి తెలుగు ఓ సబ్జెక్టుగా ఉండాల్సిందే. ఒకటి నుంచి పదో తరగతి వరకు తెలుగు సబ్జెక్టును కచ్చితంగా బోధించాలని పాఠశాల విద్యా శాఖ స్పష్టం చేసింది. భవిష్యత్తు తరాల కోసం తెలుగు భాష, సాహిత్యాన్ని పరిరక్షించే ఉద్దేశంతో 2018లో ప్రభుత్వం పాఠశాలల్లో తెలుగు తప్పనిసరి బోధన, అభ్యసనం చట్టాన్ని చేసింది. చట్టం ప్రకారం రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు ఒకటి నుంచి పదో తరగతి వరకు తెలుగును కనీసం ఒక సబ్జెక్టుగా బోధించాలి. అయితే ఒకేసారి కాకుండా విడతల వారీగా అమలు చేయాలని నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2018 జూన్ 1న జీవో జారీ చేసింది.

దాని ప్రకారం 2018-19 విద్యా సంవత్సరంలో 1, 6 తరగతులు.. 2019-20లో 2, 7 తరగతులు.. 2020-21లో 3, 8 తరగతులు, 2021-22లో 1 నుంచి 9 వరకు... 2022-23లో ఒకటి నుంచి పదో తరగతి వరకు తెలుగును బోధించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. తెలుగు మాతృభాష విద్యార్థుల కోసం 1 నుంచి 5 తరగతులకు 'జాబిలి'.. 6 నుంచి 8 వరకు 'నవవసంతం'... 9, 10 తరగతులకు 'సింగిడి' పేరుతో ఎస్​సీఈఆర్​టీ తెలుగు పుస్తకాలను అందుబాటులోకి తెచ్చింది. తెలుగేతర మాతృభాష ఉన్న విద్యార్థుల కోసం 1 నుంచి 5 తరగతులకు 'తేనె పలుకులు' 6 నుంచి 10 వరకు 'వెన్నెల' పేరుతో తెలుగు పుస్తకాలను ప్రచురించారు.

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని పాఠశాలల్లో అన్ని తరగతుల్లో తెలుగును కచ్చితంగా అమలు చేయాల్సిందే. జీవోను గుర్తు చేస్తూ పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ శ్రీదేవసేన ఇటీవల సర్క్యులర్ జారీ చేశారు. సర్కారు బడులతో పాటు రాష్ట్రంలోని సీబీఎస్​ఈ, ఐసీఎస్​ఈ, ఐబీ బోర్డుల పాఠశాలలూ కచ్చితంగా ప్రభుత్వ ఉత్తర్వులు అమలు చేయాలని పాఠశాల విద్యా శాఖ స్పష్టం చేసింది. ఈ విద్యా సంవత్సరం నాటికి పుస్తకాలన్నీ సవరించాక.. వచ్చే ఏడాది నుంచి అన్ని పాఠశాలలు తప్పనిసరిగా అమలు చేయాలని పేర్కొంది. అయితే ఈ ఏడాది సీబీఎస్​ఈ, ఐసీఎస్​ఈ, ఐబీ బోర్డుల పరీక్షల్లో ద్వితీయ భాషగా తెలుగును రాయాలని పాఠశాల విద్యా శాఖ సర్క్యలర్‌లో పేర్కొంది.

తెలుగును బోధించని పాఠశాలలపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. సీబీఎస్​ఈ, ఐసీఎస్​ఈ, ఐబీ బోర్డుల పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఎన్​వోసీ విషయంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలిపింది. పాఠశాలలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని సీబీఎస్​ఈ, ఐసీఎస్​ఈ, ఐబీ తదితర బోర్డుల ఛైర్‌పర్సన్లను పాఠశాల విద్యా శాఖ కోరింది. తెలుగు బోధించేందుకు ఉపాధ్యాయులను నియమించుకోవాలని స్పష్టం చేసింది. తెలుగు బోధించని పాఠశాలలకు నోటీసులు జారీ చేసి సవరించుకునేందుకు ఒక అవకాశం ఇస్తామని పాఠశాల విద్యా సంచాలకురాలు తెలిపారు. అప్పటికీ స్పందించపోతే మొదటిసారి 50 వేల రూపాయలు, రెండో సారి లక్ష రూపాయల జరిమానా తప్పదని శ్రీదేవసేన హెచ్చరించారు. అయనప్పటికీ ఫలితం లేకపోతే.. పాఠశాలల అనుమతి రద్దు చేస్తామని పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.