సికింద్రాబాద్ ఓల్డ్ అల్వాల్ పరిధిలో .. ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ ఆధ్వర్యంలో సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ నగర్ గ్రౌండ్లో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక సంఘ్ పరివార్ నాయకులు ఎన్ ఆర్ కే రెడ్డి, బీఎస్ శర్మ పాల్గొన్నారు.
చెడు ప్రవర్తనను ..
ఆది నుంచి సంఘ్ పరివార్ పండగలను పవిత్రంగా భావిస్తుందని సంఘ్ పరివార్ సభ్యుడు డి.ఎస్ శర్మ తెలిపారు. సంక్రాంతి నుంచి వాతావరణంలో మార్పులు జరుగుతాయని తెలిపిన ఆయన .. ప్రజలు తమలో మంచిని ఉంచి చెడు ప్రవర్తనను భోగిమంటల్లో కలపాలని సూచించారు.
ముగ్గుల పోటీలు ..
సంక్రాంతి పండగను పురస్కరించుకుని ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని పండగ గొప్పతన్నాన్ని చేప్పేలా రంగవల్లులు వేశారు. విజేతలకు బహుమతులు అందజేశారు.
ఇదీ చదవండి: తొలిరోజు అలరించిన స్కై డైవింగ్... సామాన్య ప్రజలకూ అవకాశం