కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడే పారిశుద్ధ్య కార్మికులకే రక్షణ లేకుండా పోతోంది. ఇబ్రహీంపట్నం, తుర్కయాంజల్, బీఎస్ రెడ్డినగర్, హయత్‌నగర్ తదితర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే కార్మికుల కోసం పరిమిత సంఖ్యలో బస్సులు నడిపుతున్నారు. వేల మంది కార్మికులున్న నగరంలో ఈ కొద్దిపాటి బస్సుల్లోని అవస్థలు పడుతూ కార్మికులు ప్రయాణం చేస్తున్నారు.
కనీస దూరం పాటించాలని చెబుతున్న అధికారులే.. పారిశుద్ధ్య కార్మికులకు ఆ అవకాశం లేకుండా చేస్తున్నారు. సుమారు 20 వేల మందికి కేవలం 25 బస్సులు మాత్రమే కేటాయించినట్లు కార్మికులు తెలిపారు. ఏ ఒక్కరిలో కరోనా లక్షణాలున్న అందరం ఇబ్బందుల్లో పడతామని వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బస్సుల సంఖ్యతోపాటు, నాణ్యమైన గ్లౌజులు, మాస్కులు అందించాలని పారిశుద్ధ్య కార్మికుల సంఘం ఈస్ట్ జోన్ నాయకుడు మహేశ్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ఇవీచూడండి: పలు ప్రాంతాల్లో హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ పర్యటన