ETV Bharat / city

మార్కెట్లో చిరుతిళ్లు, డైపర్ల, శానిటరీ నాప్కిన్లు కొరత

కరోనా దెబ్బతో ప్యాకేజీ ఆహార వస్తువులు డిమాండ్‌ మేర అందుబాటులో ఉండటం లేదు. లాక్‌డౌన్‌తో గోదాముల నుంచి డిస్ట్రిబ్యూటర్లు, అక్కడి నుంచి దుకాణాలకు సరఫరాలో ఆటంకం ఏర్పడుతోంది. బియ్యం, ఉప్పు, పప్పుల నిల్వలు భారీగా ఉన్నప్పటికీ... సూపర్‌మార్కెట్లు, పెద్ద కిరాణా దుకాణాల్లో బిస్కెట్లు, చాక్లెట్లు, చిప్స్‌, నూడుల్స్‌ లాంటి ఆహార వస్తువులు, డైపర్లు, శానిటరీ నాప్కిన్లు అవసరాలకు తగ్గట్టు అందుబాటులో లేవు.

lock down
నాప్కిన్లు కొరత
author img

By

Published : Apr 13, 2020, 10:39 AM IST

మారుతున్న ఆహార అలవాట్లలో భాగంగా బిస్కెట్లు, చాక్లెట్లు, చిప్స్‌, నూడుల్స్‌, టీ, కాఫీ పొడి, జామ్‌ లాంటి వస్తువులు దైనందిన జీవితంలో భాగమయ్యాయి. ఎఫ్‌ఎంసీజీ (ఫాస్ట్‌ మూవింగ్‌ కన్స్యూమర్‌ గూడ్స్‌) రంగంలో చాలా కంపెనీలు ఉన్నప్పటికీ అనుమతుల్లో ఆలస్యం, సిబ్బంది కొరతతో జాప్యం జరుగుతోంది. ‘ఇంట్లో పిల్లలు అడుగుతున్నారని జామ్‌, నూడిల్స్‌ కోసం ఐదారు దుకాణాలకు వెళ్తే లేవన్న సమాధానం వచ్చింది. కొన్ని కంపెనీల బిస్కెట్లు మార్కెట్లో లేవు’ అని ఎల్బీనగర్‌కు చెందిన ఆనంద్‌ తెలిపారు. ‘

బిస్కెట్లు, చాక్లెట్లు, చిప్స్‌, డ్రైఫ్రూట్స్‌ వంటివాటి సరఫరా వారం క్రితం నిలిచిపోయాయి. మళ్లీ ఎప్పుడు వస్తాయో తెలియదు’ అని సూపర్‌మార్కెట్‌ ఉద్యోగి ఒకరు చెప్పారు. ఆన్‌లైన్లోనూ తీవ్ర కొరత ఉంటోంది. ఈ-వాణిజ్య సంస్థలకు అనుమతిచ్చినా, సరకులు పరిమితంగా ఉన్నాయి.

తగ్గిన డైపర్ల సరఫరా..

పిల్లలు, వృద్ధుల డైపర్లు విదేశాల నుంచి ఎక్కువగా దిగుమతి అవుతుంటాయి. మరోవైపు దేశీయ కంపెనీల మధ్య పోటీ ఎక్కువగా ఉంది. గతంలో ఎంఆర్‌పీ (మాగ్జిమం రిటైల్‌ ప్రైస్‌)పై 40-60 శాతం వరకు రాయితీలు ఇచ్చేవి. ఇప్పుడు దిగుమతులు తగ్గడం, దేశీయ కంపెనీల నుంచి క్షేత్రస్థాయిలో సరఫరా లేకపోవడం వల్ల గరిష్ఠ ధరలకే విక్రయిస్తున్నారు.

‘గోదాముల నుంచి తెచ్చేందుకు రవాణా ఇబ్బందులున్నాయి. వాహనాల కిరాయి గణనీయంగా పెరిగింది’ అని ఓ దుకాణ నిర్వాహకుడు తెలిపారు. మహిళల శానిటరీ నాప్కిన్లు కూడా డిమాండ్‌కు తగినట్లుగా మార్కెట్లో అందుబాటులో లేని పరిస్థితులు నెలకొన్నాయి.

ఇవీ చూడండి: ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.