హైదరాబాద్ పంజాగుట్టలో తొలగించిన అంబేడ్కర్ విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించాలని డిమాండ్ చేస్తూ... ప్రగతి భవన్ ముట్టడికి సమత సైనిక్ దళ్ కార్యకర్తలు యత్నించారు. పంజాగుట్ట కూడలిలోనే పోలీసులు వారిని అరెస్ట్ చేసి గోషామహల్ స్టేడియం తరలించారు. స్టేడియంలోనే నిరసన తెలుపుతూ ఆందోళన కొనసాగించారు. అంబేడ్కర్ జయంతి రోజున నివాళ్ళు అర్పించకుండా సీఎం కేసీఆర్ చరిత్ర హీనుడిగా మిగిలిపోయాడని విమర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం స్థానంలో 150 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు.
ప్రగతిభవన్ ముట్టడి యత్నం, కార్యకర్తల అరెస్ట్ - undefined
అంబేడ్కర్ జయంతి రోజున సీఎం నివాళ్ళు అర్పించకుండా చరిత్ర హీనుడిగా మిగిలిపోయారని సమత సైనిక్ దళ్ నాయకులు విమర్శించారు. పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహ తొలగింపునకు నిరసనగా ప్రగతిభవన్ ముట్టడికి యత్నించారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి గోషామహల్ స్టేడియంకు తరలించారు.