ETV Bharat / city

ఆర్జీయూకేటీ ఉమ్మడి ప్రవేశ పరీక్షకు నిమిషం నిబంధన - RGUKT News

ఈ నెల 28న ఉదయం 11 గంటలకు తెలుగు రాష్ట్రాల్లో రాజీవ్‌ గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం ఉమ్మడి ప్రవేశ పరీక్ష జరగనుంది. పరీక్ష రాసేందుకు వచ్చే అభ్యర్థులు నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఉండదని కన్వీనర్ హరినారాయణ తెలిపారు.

ఆర్జీయూకేటీ ఉమ్మడి ప్రవేశ పరీక్షకు నిమిషం నిబంధన

author img

By

Published : Nov 26, 2020, 11:03 PM IST

తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 28న జరగనున్న రాజీవ్‌ గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) ఉమ్మడి ప్రవేశ పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లో అనుమతించరాదని నిర్ణయించారు. ఈ నెల 28 ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్ష జరగనుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 88,972 మంది విద్యార్థులు పరీక్ష హాజరుకానున్నారని, వీరిలో ఏపీకి చెందిన వారు 86,617 మంది ఉన్నారని కన్వీనర్‌ హరినారాయణ ఓ ప్రకటనలో తెలిపారు.

పరీక్ష కేంద్రాలు

ఏపీలో 630, తెలంగాణలో 8 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఈ ప్రవేశ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లో 4 వేల సీట్లు, ఎన్‌జీ రంగా వ్యవసాయ, శ్రీవెంకటేశ్వర వెటర్నరీ, వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయాల్లో డిప్లామా కోర్సులకు 6 వేల సీట్లు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. 53 మంది అంధ విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారని వెల్లడించారు. విద్యార్థులు ఫొటో అటెండెన్స్‌ షీట్‌లో సంతకం చేసే ముందు వివరాలు పరిశీలించాలని, ఒకవేళ తప్పులు ఉంటే సరిదిద్దుకోవాలని సూచించారు. కరోనా సంరక్షణ చర్యల్లో భాగంగా ఒక్కో పరీక్ష గదిలో 16 మంది విద్యార్థులు మాత్రమే కూర్చొనేలా ఏర్పాటు చేశామని హరినారాయణ పేర్కొన్నారు.

ఇవీ చదవండి: నీరు, కరెంట్ ఫ్రీ, ఆస్తిపన్ను మాఫీ: భాజపా హామీలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.