సాహెబ్‌నగర్ వద్ద మ్యాన్‌హోల్‌లో దిగి మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఇవాళ ప్రమాద స్థలిని పరిశీలించిన ఆయన... జీహెచ్ఎంసీ, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే కార్మికులు మృతి చెందారని ఆరోపించారు.
బాధిత కుటుంబాలని ప్రభుత్వం ఆదుకుని వారికి ఇళ్లు, జీహెచ్ఎంసీలో ఉద్యోగం, ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.
ప్రమాదవశాత్తు ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈఘటనకు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పాటు జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం కూడా ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. ఇలాంటి ఘటనల్లో ఎక్కువగా పేదవారే ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా, ఇళ్లు, జీహెచ్ఎంసీలో ఉద్యోగం ఇప్పించాలి. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి.
ఇదీ చూడండి: GHMC: మ్యాన్‌హోల్‌లోకి దిగి ఇద్దరి గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం