గాంధీ జయంతి సందర్భంగా అసెంబ్లీ ఆవరణలోని మహాత్ముని విగ్రహానికి ప్రభుత్వ విప్ రేగా కాంతారావు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ ఛైర్మన్ కోరం కనకయ్య పాల్గొన్నారు.
గాంధీజీతో పాటు అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ముందుకు నడవాలని రేగా కాంతారావు సూచించారు. దేశ సమైక్యతకు ప్రజలు పాటుపడాలని కోరారు.