ETV Bharat / city

సికింద్రాబాద్ అగ్నిప్రమాదం.. ఎలక్ట్రిక్ వాహనాలే కారణం - సికింద్రాబాద్ అగ్నిప్రమాదం లేటెస్ట్ న్యూస్

Secunderabad Fire accident latest update : రాష్ట్రవ్యాప్తంగా గుబులు రేపిన సికింద్రాబాద్ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. మరో తొమ్మది మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేసిన అగ్నిమాపక, పోలీసు అధికారులకు కీలక ఆధారాలు లభించాయి. సెల్లార్‌లో ఉన్న ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు పేలడం వల్ల టైర్లు మంటల్లో కాలాయని.. ఆ టైర్ల నుంచి వచ్చిన విషయవాయువుల వల్లే పైన లాడ్జిలో ఉన్న వారు ఊపిరాడక మరణించారని తెలిపారు.

Secunderabad Fire accident latest update

author img

By

Published : Sep 14, 2022, 7:13 AM IST

Secunderabad Fire accident latest update : పనులు ముగించుకొని వచ్చి గదుల్లో సేదతీరుతున్న సమయం.. అకస్మాత్తుగా భారీ పేలుడు శబ్దం.. తేరుకునేలోపు చుట్టూ దట్టమైన పొగలు.. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవటంతో చిమ్మచీకట్లు.. హాహాకారాలు చేస్తూ కిందకు దిగేందుకు ప్రయత్నించిన వారంతా మెట్ల మార్గంలో వ్యాపించిన పొగతో ఊపిరాడక కుప్పకూలిపోయిన దైన్యం.. మరికొందరు కిటికీలు తెరచి కిందకు దూకారు. ఇంకొందరు గోడలకున్న సిమెంట్‌ పైపులు పట్టుకొని కిందకు దిగారు. సోమవారం రాత్రి సికింద్రాబాద్‌ పాస్‌పోర్టు కార్యాలయం సమీపంలోని రూబీ లగ్జరీ ప్రైడ్‌ లాడ్జిలో అగ్నిప్రమాద సమయంలో భీతావహ దృశ్యాలివి. ఈ ప్రమాద క్షతగాత్రుల్లో మంగళవారం మరొకరు మృతిచెందగా.. మొత్తం మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది.

తొమ్మిది మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై ప్రధాని మోదీ విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3 లక్షల చొప్పున, కేంద్రం రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాయి. క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ప్రధానమంత్రి జాతీయ విపత్తు నిధి నుంచి చెల్లించనున్నారు. ఘటనాస్థలాన్ని మంగళవారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ సందర్శించారు.

అసలేం జరిగిందంటే.. రూబీ లాడ్జి ఐదు అంతస్తుల భవనంలో కొనసాగుతోంది. మొదటి అంతస్తులో ఫైనాన్స్‌ సంస్థ, రిసెప్షన్‌ విభాగాలున్నాయి. తర్వాతి అంతస్తుల్లోని 25 గదులను అద్దెకు ఇస్తున్నారు. వాహన పార్కింగ్‌కు కేటాయించిన సెల్లార్‌లో విద్యుత్‌ ద్విచక్రవాహనాల షోరూం నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన 25 మంది 1-2 రోజులు ఉండేందుకు ఈ లాడ్జిలో బస చేశారు. సోమవారం రాత్రి 9.17 గంటలకు సెల్లార్‌లో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. క్షణాల్లో అగ్నికీలలు వ్యాపించి.. వాహనాలన్నీ కాలిపోయాయి. వాహనాలు, టైర్లు కాలటంతో దట్టమైన పొగ వ్యాపించింది. రెప్పపాటులో ఐదంతస్తుల్లో ఉన్న గదులను పొగ చుట్టుముట్టి లోపలున్న వారిని ఉక్కిరిబిక్కిరి చేసింది.

మృతులు

మృతులు వీరే.. అల్లాడి హరీశ్‌(33) విజయవాడ, వీరేంద్రకుమార్‌ దెవాకర్‌(50) దిల్లీ, సీతారామన్‌(48) చెన్నై, ఎన్‌.బాలాజీ(58) చెన్నై, రాజీవ్‌ మాలిక్‌(54) దిల్లీ, సందీప్‌ మాలిక్‌(52) దిల్లీ, చందన్‌ జేతి(30), మిథాలీ మహాపాత్ర(29) ఒడిశా.

మృతులు

క్షతగాత్రులు.. కె.వి.సంతోష్‌(26) విశాఖపట్నం, జయంత్‌(39) బెంగళూరు, దేవాశీష్‌ గుప్తా(26), బి.యోగిత(26) విశాఖపట్నం, కె.కె.కేశవన్‌(27) చెన్నై, దీపక్‌యాదవ్‌(38) హరియాణా, ఉమేశ్‌కుమార్‌ ఆచార్య(35) కోల్‌కతా, మన్మోహన్‌ఖన్నా(48) హైదరాబాద్‌, రాజేశ్‌ జగదీశ్‌ ఛాబ్రా(49) గుజరాత్‌. వీరిని యశోదా, అపోలో, గాంధీ ఆసుపత్రులకు తరలించారు. జయంత్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

కేసు నమోదు.. రూబీ హోటల్‌, ఎలక్ట్రిక్‌ స్కూటర్ల షోరూంలను రాజేంద్రసింగ్‌ బగ్గా, సుమీత్‌ సింగ్‌ నిర్వహిస్తున్నారు. సెల్లార్‌లో ఎటువంటి అనుమతుల్లేకుండా స్కూటర్ల షోరూం నడుపుతున్నారు. ఆ భవనంలో అసలు అగ్నిమాపక నిబంధనలేవీ పాటించలేదని అధికారులు గుర్తించారు. ప్రమాదం నుంచి బయటపడిన మన్మోహన్‌ ఖన్నా ఇచ్చిన ఫిర్యాదు మేరకు మోండా మార్కెట్‌ పోలీస్‌స్టేషన్‌లో 304 పార్ట్‌ 3, 324 ఐపీసీ అండ్‌ సెక్షన్‌ 9 బి ఎక్స్‌ప్లోజివ్‌ యాక్ట్‌ 1884 ప్రకారం కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. సోమవారం రాత్రి నుంచి పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు రాజేంద్రసింగ్‌ బగ్గాను మంగళవారం నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

ఎటుచూసినా హాహాకారాలు.. రెండో అంతస్తులోని గదిలో ఉన్న ఓ వ్యక్తి.. పొగతీవ్రతకు ఊపిరాడక పరుగెత్తుతూ మెట్లపై నుంచి జారి కింద పడ్డారు. తలకు బలమైన గాయం కావటంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది.. ఆ వ్యక్తిని అతికష్టమ్మీద బయటకు తీసుకొచ్చారు. ఓ గదిలో ఉన్న నలుగురు వ్యక్తులు ఊపిరాడక కూర్చున్నచోటే కుప్పకూలారు. ఆ నలుగురినీ రక్షించి గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఓ మహిళ పైపు పట్టుకొని కిందకు దిగేందుకు ప్రయత్నించగా స్థానికులు సాయం చేశారు. మరో యువకుడు రెండో అంతస్తు నుంచి కిందకు దూకడంతో తీవ్రంగా గాయపడ్డారు. మొదటి అంతస్తు నుంచి దూకిన ఓ యువతిని దుప్పట్లతో కాపాడారు. సోమవారం రాత్రి 10 గంటల నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకూ అగ్నిమాపక, పోలీసు అధికారులు, స్థానికులు మంటలను అదుపు చేయటం, బాధితులను కాపాడటంలో నిమగ్నమయ్యారు.

మష్రూమ్‌ ఎఫెక్ట్‌.. ఎలక్ట్రిక్‌ వాహనాల ఓవర్‌ ఛార్జింగ్‌ మంటలకు కారణంగా భావిస్తున్నారు. మంటల ధాటికి ఒక్కసారిగా బ్యాటరీలు పేలడంతో వాహనాల టైర్లూ అగ్నికి ఆహుతయ్యాయి. వాటి నుంచి వెలువడిన కార్బన్‌మోనాక్సైడ్‌, లిథియం విషవాయువులు దట్టంగా వ్యాపించాయి. దీనికి ‘మష్రూమ్‌ ఎఫెక్ట్‌’ తోడవడంతో ప్రాణనష్టం జరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. మంటలు వ్యాపించిన తీరు, కమ్మేసిన పొగ, వ్యాపించిన రసాయనాలు, విష వాయువుల ఆధారంగా ఇది ‘మష్రూమ్‌ ఎఫెక్ట్‌’గా నిపుణులు పేర్కొన్నారు. మంటలు, దట్టమైన పొగ కలిసి వేగంగా పైకి వెళ్లడాన్ని ‘మష్రూమ్‌ ఎఫెక్ట్‌’ అంటారు. సాధారణంగా గాలి ఎక్కువగా లేని బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్‌మెంట్ల సెల్లార్లలో అగ్ని ప్రమాదాల సమయంలో ఇలా జరుగుతుంది. పొగ కనిపించిన 12 సెకండ్లలోనే పేలుడు సంభవించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ద్వారా అధికారులు అంచనా వేశారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.